ఆర్జీవీ వర్సెస్ జీవీ.. సమాధానం సినిమా రూపంలో... | Actor GV ready to direct ‘Asalu Vangaveeti’.

Actor gv accepted varma challenge

Asalu Vangaveeti, Real Vangaveeti, GV Sudhakar Naidu Ram Gopal Varma, RGV GV, Actor GV Vangaveeti movie, Actor GV in Politics, GV Sudhakar Naidu Politics, Kamma GV Sudhakar Naidu, GV Kamma Politics, Varma on GV comments, Varma GV, RGV GV, GV RGV, Tollywood Actor GV Sudhakar Naidu, Telugu Actor challenge Varma, Vangaveeti Movie, Vangaveeti versus Reak Vangaveeti

Actor GV aka GV Sudhakar Naidu has reportedly decided to make a new film on Vangaveeti Ranga which will apparently be called 'Real Vangaveeti" with positive aspects.

అసలు వంగవీటి సవాల్ తీసి తీరాతాడంట!

Posted: 12/28/2016 09:51 AM IST
Actor gv accepted varma challenge

వంగవీటి వివాదం ఇంకా పచ్చిగానే ఉంది. దర్శకుడు రాంగోపాల్ వర్మపై రంగా-రాధా మిత్రమండలి ఇంకా గుర్రుగానే ఉంది. కరడుగట్టిన ఓ రౌడీషీటర్ గా సినిమాలో చూపించటంపై వారంతా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చరిత్రను వక్రీకరించిన పకోడీగాడని, డబ్బే కావాలంటే తామంతా చందాలు వేసుకుని ఇచ్చేవాళ్లం కదా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. అయితే వర్మకూడా అదే స్థాయిలో రిటార్ట్ ఇచ్చాడనుకోండి. ఆ చందాలేవో మీరే ఉంచుకుని అసలైన వంగవీటి సినిమా తీసుకోండంటూ గట్టిగానే కౌంటర్ వేశాడు.

అయితే ఇప్పుడు ఈ వివాదంపై మరో నటుడు కమ్ దర్శకుడు స్పందించాడు. సినిమాల్లో నెగటివ్ వేషాలు వేసుకుంటూ ఆ మధ్య ఓ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన జీవీ సుధాకరనాయుడు అలియాస్ జీవీ ఏకంగా వర్మకే ఛాలెంజ్ విసిరాడు. వంగవీటి రంగపై తానూ ఓ బయోపిక్ తీస్తానని అనౌన్స్ చేశాడు. కాపు నేత అయిన ఆయన చేసిన మంచి పనులను ప్రజలకు తెలియజేస్తూ పూర్తిగా పాజిటివ్ కోణంలో ఆ సినిమా ఉండబోతుందని చెప్పాడు. చాతనైతే ఆ సినిమాను ఆపాలంటూ వర్మకు సవాల్ కూడా విసిరాడు.

మొన్నా మధ్య జరిగిన వర్మ శివ టూ వంగవీటి పంక్షన్ లోనూ జీవీ సందడి చేయటం చూశాం. అయితే సినిమాలో రంగను హీరోగా చూపిస్తాడనుకుంటే వర్మ పూర్తిగా విలన్ గా మార్చేశాడంటూ జీవీ మండిపడుతున్నాడు. అన్నట్లు గతంలో నితిన్ తో హీరో, శ్రీకాంత్ తో రంగ-ది దొంగ అంటూ రెండు సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు ఈ విలన్ పాత్రల ఆర్టిస్ట్. కాగా, రాజకీయ కాంక్షతోనే వంగవీటి విషయంలో జీవీ కల్పించుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గాజువాక నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు. ఆ సమయంలో జీవీపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి కూడా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Real Vangaveeti  GV Sudhakar Naidu  Ram Gopal Vamra  

Other Articles