బూతు సినిమాలు చేస్తావా అని అడుగుతున్నారంట | soft porn offers for Sana Khan.

Sana khan suffers with soft porn tagline

Sana khan, Tollywood actress soft porn, wajah tum ho actress no ofers, Sana khan no offers, Sana khan bold, Sana khan bollywood, makers wajah tum ho actress

Sana khan no offers in Bollywood after wajah tum ho failure.

సనాకు అన్నీ బీ గ్రేడ్ అవకాశాలేనా?

Posted: 12/27/2016 05:01 PM IST
Sana khan suffers with soft porn tagline

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్నట్లు కెరీర్ ను మలుచుకునేందుకు హీరోయిన్లు చేసే ప్రయత్నాలు ఒక్కోసారి బెడిసి కొడుతుంటాయి. తమకు మించి వాళ్లు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వకపోగా ఓ బ్యాడ్ ట్యాగ్ లైన్ ను అంటకడితే ఎలా ఉంటుంది. సరిగ్గా నటి సనాఖాన్ పరిస్థితి అలాగే ఉంది.

తెలుగులో నూకయ్య, కళ్యాణ్ రామ్ కత్తి సినిమాల్లో నటించిన ఈ అమ్మడు సౌత్ లో పది సినిమాలకు పైగానే చేసింది. కానీ, ఏం లాభం హిట్లు లేవు. ఎక్కడా లాభం లేకపోయింది. అయినా బాలీవుడ్ లో సల్మాన్ జయ హో(స్టాలిన్ రీమేక్) సినిమాలో ఛాన్స్ దక్కించుకోవటంతో అందరి దృష్టి మళ్లీంది. కానీ, ఆమె లెగ్ సల్మాన్ ను కూడా ముంచిందని అనుకున్నారు. ఇక లాభం లేదనుకుని చివరి అస్త్రాన్ని ప్రయోగించింది.

వాజా తుమ్ హో అంటూ ఓ క్రైమ్ థ్రిల్లర్ లో నటించింది. హేట్ స్టోరీ మేకర్లు కావటంతో మ్యాటర్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. సినిమాలో కంటెంట్ కన్నా సనా చేసిన సెక్సీ యాక్ట్ లే ఎక్కువ ఉన్నాయంటూ క్రిటిక్స్ విమర్శించారు. ఓవరాల్ గా సాఫ్ట్ పోర్న్ సినిమా అంటూ ఒక్క ముక్కలో తేల్చేశారు. పోనీ, ఆ టాక్ తర్వాత అయినా సినిమా ఆడిందా అంటే అదీ లేదు. దీంతో రెండిటికి చెడ్డ నావ లాగా అయ్యింది సనా పరిస్థితి. ఒకవైపు అలాంటి సాఫ్ట్ పోర్న్ సినిమాలు చేస్తావా? అంటూ అవకాశాలు ఇచ్చేందుకు కొందరు క్యూ కడుతుంటే.. చెప్పుకోదగ్గ అవకాశాలు లేక అజ్నాతనంలోకి వెళ్లిపోయింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sana khan  wajah tum ho  no movies  

Other Articles