వంగవీటి అసలు రిలీజ్ అవుతుందా? | High Court issues notices to Varma.

Legal troubles starts for vangaveeti

Ramgopal Varma, Vangaveeti Movie, Vangaveeti Radha, Vangaveeti team, Vangaveeti legal troubles, Vangaveeti promotions, Vangaveeti movie, Vangaveeti high court, Vangaveeti movie court

High court issues notices to Vangaveeti team follow up Radha has filed a petition in the High Court alleging that the film is being made against the facts.

వంగవీటిపై లీగలు గొడవలు మొదలయ్యాయి

Posted: 12/01/2016 08:55 AM IST
Legal troubles starts for vangaveeti

వర్మ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ వంగవీటికి చిక్కులు తప్పేలా లేవు. ఓవైపు రాజకీయాలు ఇందులో చూపించనని వర్మ చెబుతున్నప్పటికీ, వంగవీటి వారసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. వంగవీటి రంగ తనయుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధా ఈ సినిమాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

నిజాలను వక్రీకరిస్తూ వర్మ తప్పుదోవ పట్టించేలా వంగవీటి సినిమాను తెరకెక్కించాడని అదులో ఆరోపించారు. దీంతో హైకోర్టు దర్శకుడు రాంగోపాల్ వర్మతోపాటు, నిర్మాత దాసరి కిరణ్ లకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసింది. ఇంకోపక్క డిసెంబర్ 3న ఆడియో వేడుకను విజయవాడలో నిర్వహించేందుకు వర్మ అండ్ టీం ప్లాన్ చేస్తుండగానే ఈ తీర్పు వెలువడటం విశేషం.

విజయవాడలో జరిగిన వాస్తవ పరిస్థితులను, కాపు నేత వంగవీటి రంగ(వంగవీటి రాధ తండ్రి) జీవిత చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చూపించబోతున్నానని ఆర్జీవీ ఇది వరకే ప్రకటించాడు కూడా. అయితే న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఎలాగైనా సరే డిసెంబర్ 23న సినిమాను రిలీజ్ చేస్తానని సన్నిహితుల వద్ద వర్మ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  High Court  Vangaveeti Movie  Notices  

Other Articles