ఎన్టీఆర్ ను అలా ఎందుకు అన్నాడంటే... | Hari not comments NTR.

Hari responsed comments on junior ntr

Director Hari, Junior NTR, Hari Junior NTR, ari on NTR, Hari fan of NTR, Kollywood top director, Hari NTR comments, Hari Junior NTR movie

Director Hari says he fan of Junior NTR, and those comments are meaningless.

ఎన్టీఆర్ ను అలా ఎవరైనా అంటారా?

Posted: 12/01/2016 08:29 AM IST
Hari responsed comments on junior ntr

విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ గురించి సౌత్ లో తెలీనివారు ఎవరైనా ఉంటారా చెప్పండి. డైలాగ్ డెలివరీలోనూ ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ ది బెస్ట్ అని అక్కినేని నాగేశ్వర్రావు లాంటి వాళ్లు కాంప్లీమెంట్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. సౌత్ లో కూడా కొందరు స్టార్ లు ఎన్టీఆర్ స్టెప్పులకు ఫిదా అయిపోతుంటారు.

అలాంటి ఎన్టీఆర్ పై కోలీవుడ్ మాస్ డైరక్టర్ హరి కామెంట్లు చేయటం తీవ్ర కలకలాన్నే రేపింది. ఎన్టీఆర్ ఎవరో అసలు తెలీదంటూ ఆయన చెప్పాడని మీడియా కోడై కూసింది. అయితే అదంతా తనకు ఏ మాత్రం తెలీదని ఈ సింగం దర్శకుడు అంటున్నాడు. సింగం-3 రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ లో పాల్గొంటున్న ఆయన్ని ఓ తెలుగు మీడియా ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై చేసిన కామెంట్ల గురించి ప్రస్తావించగా..

అవునా? అలా ప్రచారం జరుగుతోందా? నిజం చెప్పాలంటే నేను ఎన్టీఆర్ అభిమానిని. ఆయన నటించిన టెంపర్ చిత్రాన్ని రెండు సార్లు చూశాను. నాలుగైదు సార్లు ఎన్టీఆర్‌ను కలిశాను కూడా. ఇంకా చెప్పాలంటే ఆయనతో చిత్రం చేయాలన్నది నా కోరిక. ఆ మధ్య కలిసి ఓ కథ కూడా చెప్పాను. అయితే అది సెట్ కాలేదు. అంత మాత్రంకే ఇలాంటి పుకార్లు రాయటం ఏంటని ప్రశ్నించాడు. ఇక తెలుగు స్ట్రెయిట్ మూవీ చేయాలని ఉందని అంటున్న హరి అందుకోసం తెలుగు భాషను కూడా నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Director Hari  Junior NTR  Comments  

Other Articles