యాంకర్ రష్మీ ఆల్ టైం రికార్డు.. బన్నీ రికార్డును బ్రేక్ చేసింది | Rashmi song break bunny record

Rashmi creates sensation in tollywood

Rashmi Gautham, Guntur Talkies, Nee Sontham Song, Rashmi Allu Arjun, Rashmi Gautam Youtube Record, rashmi hot song, Bunny Song Youtube, Tollywood Youtube record, Rashmi Allu Arjun, Rashmi Bunny, Rashmi Song beats Bunny

Rashmi Gautham's Guntur Talkies Nee Sontham song creates all-time Tollywood record in Youtube.

టాలీవుడ్ లో హాటీ సాంగ్ సంచలనం

Posted: 12/01/2016 12:24 PM IST
Rashmi creates sensation in tollywood

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఆల్ టైం రికార్డుతో టాలీవుడ్ లో పెను సంచలనం క్రియేట్ చేసింది. బడా బడా హీరోలకు కూడా సాధ్యం కానీ, ఫీట్ ను చేసి చూపించింది. వెరసి టాలీవుడ్ లో ఇంకెవ్వరూ దరిదాపులో అందుకోలేని రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ఈ యేడాది మొదట్లో రష్మీ నటించిన గుంటూరు టాకీస్ చిత్రం విడుదలై, యావరేజ్ గా నిలిచిన విషయం తెలిసిందే. సినిమాలో రష్మీ పాత్రను పక్కనబెడితే ఓ పాటలో మాత్రం చాలా ఘాటుగా రెచ్చిపోయింది. నీ సొంతం అంటూ సాగే సాంగ్ లో హీరో సిద్ధూతో రొమాన్స్ బాగా పండిచింది. ఆ పాటకు యూట్యూబ్ లో రెండు కోట్ల వ్యూవ్స్ రావటం విశేషం. టాలీవుడ్ లో ఇంతకు ముందు ఈ రికార్డు అల్లు అర్జున్ రేసు గుర్రం సినిమాలోని సినిమా చూపిస్త మావా పాట పేరిట ఉంది. ఆ పాట కోటి 96 లక్షల వ్యూవ్స్ తో టాప్ ప్లేస్ లో నిలవగా, తాజాగా రష్మీ పాట ఆ రికార్డును చెరిపిపడేంది..పిచ్చ బీట్ ఉన్న ఓ మాస్ పాటను, పైగా బన్నీ లాంటి డాషింగ్ డాన్సర్ పాటను క్రాస్ చేసి, ఓ బీగ్రేడ్ తరహాలో సాగే సాంగ్ క్రాస్ చేయటం అంటే చిన్న విషయం కాదనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వీక్షణలను కూడా ఓ రికార్డులుగానే పరిగణిస్తున్న సినీ విశ్లేషకులు రష్మీ సాధించిన ఈ ఫీట్ ను పట్టించుకుంటారో? లేదో? అన్నట్లు బన్నీ పాటకి ఈ రికార్డు కోసం రెండేళ్లు పట్టగా, కేవలం 9 నెలల్లోనే రష్మీ పాట సెన్సేషన్ అయి కూర్చుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmi Gautam  Guntur Talkies  Nee Sontham Song  Youtube Record  

Other Articles

Today on Telugu Wishesh