పందికి వాయిస్ ఓవర్ ఇచ్చే స్టార్ హీరో ఎవరు? | Stars Scared Of Crazy Director's Hero

Star heroes fear with piglet movie

Ravibabu, Ravibabu Pig, Piglet movie, Tollywood Piglet movie, Star Hero Voice over for Pig, Hero Voice for Pig, Ravibabu pig voice, hero ready to voice over for pig, pig voice, Ravibabu star hero for pig, Adhugo movie, Pig in Adhugo Movie

Ravibabu plan for Star Hero voice over for piglet movie, But no one dare for that.

స్టార్ హీరోలు ఎవరైనా ముందుకు రావోచ్చుకదా!

Posted: 11/23/2016 12:38 PM IST
Star heroes fear with piglet movie

టాలీవుడ్ దర్శకుడు రవిబాబు సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో అలాంటి ఆలోచనలు బహుశా ఏ దర్శకుడికి కూడా రావేమో. హాలీవుడ్ లో స్ఫూఫ్ సినిమా తరహాలో కామెడీని ప్రజెంట్ చేసే రవిబాబు ఆ మధ్య సీరియస్ సినిమాలతో ప్రయోగానికి దిగాడు. కానీ, ఫలితం మరోలా వచ్చింది. దీంతో మరోసారి తన రెగ్యులర్ ఫార్మట్ లోనే వెళ్లేందుకు సిద్ధమైపోతున్నాడు.

అదుగో అనే టైటిల్ తో కొత్త వాళ్లతో ఓ సినిమాను స్టార్ట్ చేయటం, అది కాస్త పిగ్ లెట్ సినిమా కావటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓ పంది ప్రధాన పాత్రలో కొనసాగే ఈ సినిమా టాకీ పార్ట్ ఎప్పుడో పూర్తయినప్పటికీ ప్రాజెక్టు మాత్రం చాలా డిలే అయిపోయింది. అయితే అది ఎందుకో అసలు కారణం చెప్పేస్తున్నాడు రవిబాబు.

హాలీవుడ్ సినిమాల్లో ఈ తరహా చిత్రాలకు బడా స్టార్లతో జంతువులకు వాయిస్ ఓవర్ ఇప్పించటం చాలా మాములు విషయం. రవి కూడా అదే తరహాలో ఓ పెద్ద హీరోతో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశాడంట. అయితే అందుకు ముందుకు ఎవరూ రాకపోవటంతో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఇండస్ట్రీ మొత్తానికి క్రేజీ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న ఈ పిగ్ కోసం ఎవరో ఒకరు ముందుకు రావాలంటూ రవిబాబు ఇప్పటికే విజ్నప్తి చేశాడు కూడా.

అన్నట్లు ఆ పందిని విడిచి క్షణం ఉండలేకపోతున్న రవిబాబు, ఈ మధ్య ఓ ఏటీఎం వద్ద డబ్బుల కోసం లైన్ లో నిల్చున్నప్పుడు కూడా దాన్ని చేతిలో పట్టుకునే ఉన్నాడంటే ఆ పంది మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో అర్థం చేసుకోండి.

Ravi babu Pig

Ravi babu Pig Love

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravibabu  Adhugo Movie  Piglet  star hero voice  Pig  

Other Articles