దేవుళ్లను అవమానించాడు.. నాలుక తెస్తే కోటి నజరానా | Mathura saints declare war on Toilet Ek Prem Katha

Furious mathura saints declare war on toilet ek prem katha

Toilet Ek Prem Katha, Director Narain Singh, Phooldol Behari Dass Maharaj, Toilet Ek Prem Katha controversy, Akshya Kumar new movie, Title trouble for Akki, Toilet – A Swachhta Abhiyan

Mathura sadhu offers Rs 1 Cr for Toilet Ek Prem Katha director Narain Singh's tongue.

దర్శకుడి నాలుకకి కోటి రూపాయల గిరాకీ

Posted: 11/23/2016 08:40 AM IST
Furious mathura saints declare war on toilet ek prem katha

చిత్రమైన టైటిల్ ను ఎంచుకున్నాడని బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పై ప్రశంసలు కురిపించి కొద్ది రోజులు గడవక ముందే కొత్త చిత్రం టాయ్ లెట్-ఏక్ ప్రేమ్ కథా ఇప్పుడు వివాదాల్లోకి ఎక్కింది. ఓ సాధువు టైటిల్ పై మండిపడటమే కాదు, చిత్ర దర్శకుడి నాలుక కోసి తెచ్చి ఇచ్చినవారికి కోటి రూపాయల నజరానా ప్రకటించాడు కూడా. విషయం ఏంటంటే.. ఈ చిత్ర షూటింగ్ షూటింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నంద్‌గావ్‌, బర్సానా గ్రామాల్లో కొన‌సాగుతోంది. ఇరు గ్రామాల ప్రజల భావోద్వేగాలను కించ‌ప‌రుస్తున్నార‌ని, సాంప్రదాయాన్ని దెబ్బ కొడుతున్నారంటూ మ‌ధుర‌కు చెందిన‌ బెహారీ దాస్‌ మహరాజ్‌ అనే సాధువు మండిప‌డ్డారు.

ఈ మేరకు సోమవారం బర్సానా గ్రామంలో సాధువులతో పంచాయితీ మీటింగ్ పెట్టి టైటిల్ మార్చాల్సిందేనని పట్టుబడ్డాడు. సినిమాకి ఇటువంటి టైటిల్ పెట్టిన ద‌ర్శ‌కుడి నాలుక కోసి తెచ్చిన వారికి కోటి రూపాయ‌లు ఇస్తాన‌ని ఆయన ప్రకటించారు. కృష్ణుడు-రాధా సెంటిమెంట్ లతో నంద్‌గావ్‌ గ్రామ ప్రజలు, బర్సానా గ్రామా ప్ర‌జ‌లకి మ‌ధ్య పెళ్లి సంబంధాలు కుద‌ర‌వ‌ని, అటువంటిది సినిమాల్లో ఈ రెండు గ్రామాలకు చెందిన యువ‌కుడు, యువ‌తి మధ్య ప్రేమ ఉన్న‌ట్లుగా చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.

మరో సాధువువేమో దేవుళ్లు పుట్టిన ఊళ్లను ఇలా వాడుకోవటం సరికాదని ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఇంకో సాధువు చిత్ర పేరును టాయ్ లెట్- ఏ స్వచ్ఛ భారత్ అభియాన్ అని మార్చుకుంటే కాస్త సందేశాత్మకంగా ఉంటుందని సలహా ఇఛ్చాడు. అయితే వివాదంపై స్పందించిన స‌ద‌రు సినిమా దర్శకుడు నరేన్‌ సింగ్‌.. తమ సినిమాలో అంద‌రూ అనుకుంటున్న‌ట్లు అక్క‌డి ప్ర‌జ‌ల‌ను కించ‌ప‌రిచే స‌న్నివేశాలేమీ ఉండ‌వ‌ని చెప్పారు. అస‌లు ఈ సినిమాలో ఈ రెండు గ్రామాల‌ పేర్లు చూపించడం లేదని చెప్పారు. చిత్రంలో ఓ మహిళ సాధికారత గురించి ఉంటుంద‌ని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Toilet Ek Prem Katha  Akshay Kumar  Narain Singh  Tongue  1 crore reward  

Other Articles