లక్కునోడు టీజర్ బాగానే ఉంది. మరి సినిమా... | Luckunnodu teaser full comedy punches.

Luckunnodu movie teaser released

Manchu Vishnu's Luckunnodu, Luckunnodu teaser, Luckunnodu, Luckunnodu teaser review, Luckunnodu Vishnu, Manchu Vishnu

Manchu Vishnu's Luckunnodu teaser out.

లక్కున్నోడు టీజర్ ఫుల్ కామెడీతో నింపేశాడు

Posted: 11/23/2016 10:04 AM IST
Luckunnodu movie teaser released

యాక్షన్ సినిమాలు తనకు అచ్చి రావటం లేదని అనుకుంటున్నాడేమో పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ లనే నమ్ముకుంటున్నాడు మంచు విష్ణు. ఈడోరకం ఆడో రకం హిట్ తర్వాత మరోసారి అలాంటి జోనర్ తోనే మన ముందుకు రాబోతున్నాడు. అదే లక్కున్నోడు.

ఈ చిత్ర టీజర్ రీసెంట్ గా విడుదలైంది. లక్కీ అనే పేరు ఉన్నప్పటికీ సీటు కింద దరిద్ర్యాన్ని పెట్టుకుని తిరుగుతునే క్యారెక్టర్ లో విష్ణు ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. కంప్లీట్ కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ పాలు కూడా బాగానే నింపేశారు. ఇక పాజిటివ్ మేనరిజం ఉన్న యువతిగా హన్సిక విష్ణుకి జోడీగా కనిపించబోతుంది. లుక్ పరంగా స్లిమ్ అయి ఎబ్బెట్టుగా కనిపించినప్పటికీ బాగానే కవర్ చేసినట్లు అనిపిస్తోంది. చివర్లో లక్ హగ్ ఇచ్చే లోపు, దరిద్ర్యం లిప్ లాక్ ఇస్తుందంటూ చెప్పే డైలాగ్ బావుంది.

 

గీతాంజలి ఫేం రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలోనే విడుదల కానుంది. సినిమా మొత్తం కామెడీ పంచ్ లతో నింపేసినట్లు కనిపిస్తుండటంతో చూస్తుంటే విష్ణు లక్కున్నోడుగా హిట్ కోసం అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  Luckkunodu teaser  

Other Articles