ఆహా.. రొమాంటిక్ మూడ్ లో ప్రేమ జంట | samantha and naga chaitanya in romantic mood

Samantha and naga chaitanya in romantic mood

Naga Chaitanya and Samantha, Samantha Instagram, Samantha romantic mood, samantha shared naga chaitanya pic, Lovebirds Naga Chaitanya and Samantha, Tollywood love birds

Lovebirds Naga Chaitanya and Samantha. Actress Shared Pic in Instagram.

రొమాంటిక్ మూడ్ లో చై-శామ్ దొరికిపోయారు

Posted: 11/22/2016 05:29 PM IST
Samantha and naga chaitanya in romantic mood

టాలీవుడ్ లో ఏడాదిగా ప్రేమ పక్షులుగా మారిపోయి రహాస్యంగా ప్రేమించుకున్న సమంత నాగ చైతన్యలు ఎట్టకేలకు ఓపెన్ గానే ఎగిరిపోతున్నారు. అక్కినేని ఫ్యామిలీ మెంబర్ గా కలిసిపోయిన చెన్నై బ్యూటీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అంతకు ముందు దాగుడు మూతలు ఆడిన ఈ జంట పెద్దల అంగీకారంతో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ క్లిక్ మనిపించేస్తున్నారు.

రీసెంట్ గా విత్ ఫ్యామిలీ అంటూ అఖిల్, అతనికి కాబోయే భార్య శ్రీయాతోపాటు, చైతూతో కలిసి ఉన్న ఓ పార్టీ ఫోటోను సమంత ఇన్ స్టాగ్రామ్ తో పోస్ట్ చేసింది. ఆపై కాస్త గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఏకంగా చైతూ తో రొమాంటిక్ మూడ్ లో ఉన్న పిక్ నే పెట్టేసింది.

ఏదో పబ్లిక్ ప్లేస్ లో ఇద్దరు షార్ట్ బట్టలు వేసుకుని, కళ్లజోడు పెట్టుకుని, ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఉన్న ఫోటోను తన ఖాతాలో అప్ లోడ్ చేసింది. ఇంతకన్నా బెస్ట్ రొమాంటిక్ మూడ్ ఉండదేమో అన్న రీతిలో అనిపిస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అక్కినేని బ్రదర్స్ ఇద్దరూ పెళ్లి తంతు దగ్గర పడుతుండటంతో ఇలా ప్రైవేట్ పార్టీలు చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారులేండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood love birds  Samantha instagram  Naga Chaitanya  Romantic mood  

Other Articles