చంద్రమోహన్ సినిమాలు అందుకే చేయట్లేదా? | Chandra Mohan criticised young heroes.

Chandra mohan fire on young heroes

Senior actor Chandra Mohan, Chandra Mohan, Chnadra Mohan fire on Young Heroes, Tollywood heroes not respect young heroes, After kota now its chandra mohan term

Senior actor Chandra Mohan chastised the young Tollywood heroes for not having any respect for senior artistes.

టాలీవుడ్ సీనియర్ నటుడికి ఏమైంది?

Posted: 11/22/2016 05:43 PM IST
Chandra mohan fire on young heroes

ఇప్పుడున్న యంగ్ హీరోలకు చాలా పొగరు ఎక్కువ. పెద్దలంటే గౌరవమే లేదంటూ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ ఆ మధ్య ఫైర్ అయిన సంగతి తెలిసిందే. వారికి తగ్గట్లే దర్శకులు, నిర్మాతలు నడుచుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టులను, విలన్ లను పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారంటూ ఆయన ఓపెన్ గానే మండిపడ్డాడు. తాజాగా మరో సీనియర్ నటుడు కూడా ఇలాంటి కామెంట్లే చేశాడు.

70, 80 దశకాల్లో హీరో పాత్రలు చేసి ఆపై క్యారెక్టర్ నటుడిగా సెటిల్ అయిన చంద్రమోహన్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నాడు. ఇప్పుడున్న యంగ్ హీరోలంతా ఏదో ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్ లాగా ఫీలయిపోతున్నారు. సీనియర్ నటులంటే కొంచెం కూడా గౌరవం లేదు. సెట్స్ లో కూడా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. వారికి నచ్చినట్లు సినిమాలను మార్చేసుకుంటున్నారు.  వారి చెప్పుచేతల్లో నడిచే సినిమాల్లో నటించడం ఇష్టం లేకనే కొత్త సినిమాలను ఒప్పుకోవటం లేదు అంటూ చెప్పుకోచ్చారు.

హీరో డామినేషన్ ఉండే టాలీవుడ్ సీనియర్ హీరోలను టార్గెట్ చేసి హీరోయిన్లు ఆ మధ్య కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. కానీ, ఇలా 50 ఏళ్ల నటనా అనుభవం ఉన్న సీనియర్ నటులు కూడా తిట్టిపోస్తున్నారంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandra mohan  fire  tollywood young heroes  

Other Articles