లెస్బియన్ జంటను అవమానించిన గీత.. తీవ్ర విమర్శలు | Actress Geetha humiliates LGBT couple during TV show

Actress geetha humiliates lgbt couple during tv show

actress Geetha LGBT, Geetha Bathuku Jatka Bandi, Geetha LGBT Controversy, Bathuku Jatka Bandi Controversy, Actress Geetha insult Lesbian couple, Senior Actress Geetha LGBT

Actress Geetha humiliates LGBT couple during TV show.

లెస్బియన్ జంటపై కామెంట్లతో నటిపై విమర్శలు

Posted: 11/07/2016 02:45 PM IST
Actress geetha humiliates lgbt couple during tv show

ఇంటి సమస్యలను పరిష్కారం చేస్తామంటూ వ్యక్తిగత విషయాలను బుల్లితెరకు ఎక్కిస్తున్న టీవీ షోలు వాటిని పరిష్కారం చేయటం మాట అటుంచి తీవ్ర వివాదాలకు కారణమౌతున్నాయి. టీఆర్పీ కోసం దిగజారి వారు చేస్తున్న వ్యాఖ్యలు, చేష్టలతో ఛానెళ్ల పరువు పొవటమే కాదు, వ్యక్తిగతంగా కూడా సదరు యాంకర్లు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తాజాగా ఓ ప్రమఖ ఛానెల్ ప్రసారమయ్యే షోలో సీనియర్ నటి గీత వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ఓ లెస్బియన్ జంట టీవీ షోకొచ్చింది. ట్రాన్స్ మ్యాన్‌ను గీత అడిగిన ప్రశ్నకు అవాక్కవడం ఆ షో చూసే వాళ్ల వంతైంది. ‘ఒక యువతి నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు కూడా ఓ అమ్మాయివన్న విషయాన్ని మర్చిపోయావా’ అని గీత ఆ ట్రాన్స్ మ్యాన్ అడిగింది. ‘ఒక అబ్బాయిలా ఆ అమ్మాయిని ఇంటి నుంచి తీసుకొచ్చావ్.. మీపై ఎవరైనా దాడి చేసి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటే పరిస్థితి ఏంటని అని ప్రశ్నల వర్షం కురిపించింది.

గీత వాగ్దాటి అంతటితోనే ఆగలేదు. లెస్బియన్స్, గే పెళ్లి చేసుకుంటున్న విషయం తనకు తెలుసని కానీ పాశ్చాత్య దేశాల జాడ్యాన్ని ఇండియాలో పాటించడం ఎంత వరకూ సబబని గీత అడిగింది. ‘మీ ఇద్దరు తీసుకున్న నిర్ణయం అవివేకం, మీరిలా పార్కులకు, సినిమాలకు వెళితే ఉరి తీస్తారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అబ్బాయిలా మారాలంటే డ్రస్ చేసుకున్నంత మాత్రాన సరిపోదని గీత చెప్పింది.

 

ఒకానోక సందర్భంలో కోపాన్ని అణచుకోలేక, ఆగ్రహంతో ఊగిపోయిన గీత ‘ఒక అమ్మాయివి అయ్యి ఉండి వేరే అమ్మాయితో గడపడం సిగ్గుగా లేదా అని ప్రశ్నించింది. నిన్ను కొట్టి, కాళ్లు విరగ్గొడతానంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ షోపైనా, గీత పైన హైద్రాబాద్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బేషరతుగా జీ ఛానెల్ సదరు ప్రోగ్రాం నిర్వాహకులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వార్త ప్రముఖంగా జాతీయ మీడియాలో కూడా ప్రసారం కావటం విశేషం. ఈ మధ్య ఒక వ్యక్తిపై దాడి చేయటం ద్వారా రోజా, మరో షోలో బలవంతంగా హాజరు కావాలంటూ ఓ వ్యక్తిని బెదిరించారని నటి జీవిత వ్యక్తిగత సిబ్బంధిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ షోనే గీత రిప్లేస్ చేసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Geetha  LGBT  Bathuku Jatka bandi  Controversy  

Other Articles