ఏపీ నంది కంటే తెలంగాణ సింహా అవార్డులే బెటరా? | Simha Awards to replace nandi in Telangana.

No more nandi awards in telangana

Simha Awards, Telangana Simha Telangana Awards 2017, KCR Simha Awards, No more nandi Awards in telangana, Telangana Simha Awards, AP Nandi telangana Simha Awards

Telangana Government Simha Awards instead of Nandi from 2017.

నంది అవార్డులపై తెలంగాణ కీలక నిర్ణయం

Posted: 11/07/2016 04:26 PM IST
No more nandi awards in telangana

టాలీవుడ్ అధికారిక అవార్డుల పండగ నంది అవార్డుల వేడుకను సంయుక్తంగా చూసే అదృష్టం ఇక తెలుగు ప్రజలకు ఉండబోదా? ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ చలన చిత్రాలకు ఏటా ప్రభుత్వం నంది అవార్డులను ప్రదానం చేసే సందడి ఇకపై ఒక రాష్ట్రానికే పరిమితం కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి కారణం వేర్వేరుగా అవార్డులను బహుకరించాలని ఇరు ప్రభుత్వాలు నిర్ణయించటమే.

రాష్ట్ర విభజనకు ముందు మూడేళ్లపాటు(2011 నుంచి) ఈ కార్యక్రమం నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీవ్రస్థాయిలో ఉద్యమాలు జరగడంతో ప్రభుత్వం నంది అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని వాయిదా వేసింది. దాంతో, నిలిచిపోయిన కాలానికి సంబంధించి రెండేళ్లలో ఒక ఏడాది తెలంగాణ, మరో ఏడాది ఆంధ్రప్రదేశ ప్రభుత్వం అవార్డులు బహూకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసి ఏపీ ముందు ఉంచింది.

అయితే దానికి ఎటువంటి స్పందన లేకపోవటంతో 2014 జూన్ 2 నుంచే స్వంతంగా అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. దీనికి సింహా అవార్డులుగా నామకరణం కూడా జరిగిపోయింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సింహా అవార్డుల సిఫార్సుకు ప్రతిపాదన చేయగా, రేపో మాపో దానికి సీఎం కేసీఆర్ నుంచి రాజముద్ర పడనుంది. మరోవైపు పారితోషక విషయంలో కూడా ఓ మెట్టు ఎక్కువగా ఉండాలని భావిస్తున్న టీ సర్కార్ అవార్డుతోపాటు నగదును కూడా భారీగానే ఇచ్చేందుకు సిద్ధమైపోతుంది.

ఇప్పటికే కత్తి కాంతారావు, పైడి జైరాజ్, ప్రభాకర్, చక్రి, దాశరథి కృష్ణమాచార్యల పేర్లను ఆయా విభాగాలకు పెట్టిన కమిటీ, మార్చి-ఏప్రిల్ నుంచి సింహా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు సమాచారం. ఉత్తమంగా ఎంపిక చేసిన చిత్రానికి బంగారు సింహ అవార్డు కింద జ్ఞాపిక, రూ.5 లక్షలు నగదు, ద్వితీయ ఉత్తమ చిత్రానికి రజత సింహంతోపాటు రూ.3 లక్షలు, తృతీయ ఉత్తమ చిత్రానికి తామ్ర సింహంతోపాటు రూ.2 లక్షల నగదు ఇస్తారు. కనీసం 20 శాతానికి మించి తెలంగాణ రాష్ట్రంలో చిత్రీకరించిన చలన చిత్రాలను మాత్రమే అవార్డు ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Govt  Simha Awards  Telangana  Nandi Awards  AP govt  

Other Articles