మాటల మాంత్రికుడి గురించి కొన్ని తెలియని విషయాలు | unknown and Intresting facts about trivikram srinivas

Trivikram srinivas birthday special

Trivikram Srinivas Birthday Special, Star Director Trivikram, Trivikram Srinivas 45th Birthday, Trivikram Srinivas special article, Trivikram Srinivas relationship with Pawan Kalyan and Mahesh Babu, Trivikram PK and MB, Unknown facts about trivikram srinivas, Intresting facts about Trivikram

Tollywood Director Trivikram Srinivas 45th Birthday Special.

పంచుల గనికి బర్త్ డే విషెష్

Posted: 11/07/2016 01:41 PM IST
Trivikram srinivas birthday special

పలుకే బంగారామాయేనా... మాట్లాడితే ముత్యాలు రాలుతాయ్... సాధారణంగా కవుల నోటి నుంచి ఇలాంటి మాటలు వింటుంటాం. కానీ, అతడు పెన్ను పట్టి మాటలు రాస్తే చాలూ... మాత్రం ఖచ్ఛితంగా కాసులు రాలాల్సిందే. నరనరాన వెతకారం, ఇంచు ఇంచుకి ఓ పంచ్ డైలాగులు, టోటల్ గా మాటలు మొత్తం తుటాలా పేలుతూనే ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి.. సీరియస్ గా ఆలోచింపజేస్తాయి... కలవరపరుస్తాయి. ఇదంతా మాటల మెజిషీయన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించే.. ఈ రోజు ఆయన 45వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి...

- త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్. భీమవరం లో 1971 నవంబర్ 7న జన్మించాడు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు.
- నటుడు సునీల్ ఈయన ఒకే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. త్రివిక్రమ్ మొదట్లో స్కూల్ టీచర్ గా పనిచేశారు. ఆ తర్వాత సునీల్ కలిసి హైదరాబాద్ కు చేరి ఇండస్ట్రీ లో చాన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. - మొదట్లో రోడ్ అనే ఓ సీరియల్ రాశారు. అది ప్రముఖ వార పత్రికలో ప్రచురితమైంది కూడా. ఆ తర్వాత నటుడు, రచయిత పోసాని దగ్గర 18 నెలలపాటు అసిస్టెంట్ గా చేరాడు. ఆ టైం ఆయన జీవితాన్ని మలుపు    తిప్పింది.
- అసలు త్రివిక్రమ్ డైలాగులు రాయాలన్న ఆలోచన మొదట్లో అసలు ఉండేది కాదట. ఆ తర్వాత ఎడిటర్ గౌతంరాజు గారి పరిచయంతో దర్శకుడు విజయ్ భాస్కర్ కి దగ్గర కావటం, ఆపై స్వయంవరంకి మాటలు   రాయటం చకచకా జరిగిపోయాయి. అలా రైటర్ గా త్రివిక్రమ్ ప్రస్థానం మొదలైంది.
- ఆపై నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు ఇలా వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ హిట్లే అయ్యాయి. ఆ సినిమాలు, వాటిల్లోని డైలాగులు ఇప్పటికీ మన పెదవుల కింద      తచ్చాడుతుంటాయి.
- నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారి తన సత్తా చాటాడు. తర్వాత మహేష్ బాబులోని కోణాన్ని ఆవిష్కరిస్తూ అతడు తీశాడు. ఆపై పవర్ స్టార్ తో జల్సా కానిచ్చాడు. ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది,   సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ... ఇలా ప్రతీ దాంట్లో మానవీయ కోణాన్ని సృషిస్తూ సంచలనాలతో తన సినీ జర్నీ సాగిస్తున్నాడు.
- ఇండస్ట్రీలో టాప్ హీరోలైన పవన్, మహేష్ ఇద్దరితోనూ స్నేహ బంధం కొనసాగిస్తూ, దర్శకుడిగానే కాదు.. వ్యక్తిగతంగా వారి మనోగతాలను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి ఒక్క త్రివిక్రమే.  

సినిమా ఏదైనా, సబ్జెక్ట్ ఎలాంటిదైనా అందులో పంచ్ లు, వెతకారాలకు మాత్రం కొదవ ఉండదు. షార్ట్ అండ్ స్వీట్ డైలాగులే కాదు, భారీ డైలాగులు... అందులో వేదాంతాలు త్రివిక్రమ్ సొంతం. మనసు లోని  భావాలను తెరకెక్కించటంలో త్రివిక్రమ్ ది ఓ ప్రత్యేక శైలి. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్నీ జరుపుకోవాలని ఆశిస్తూ తెలుగు విశేష్ తరపున హ్యాపీ బర్త్ డే టూ త్రివిక్రమ్ సర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Director  Trivikram Srinivas  Birthday special  

Other Articles