నన్ను ఎవరూ కొట్టలేదంటున్న బ్రహ్మాజీ | Actor Brahmaji diwali wishes with wounded face pic

Actor brahmaji diwali wishes with wounded face pic

actor Brahmaji shocking photo, who beat brahmaji, Actor Brahmaji twitter, Brahmaji wounded face, Brahmaji blood face, Brahmaji in winner movie

Actor Brahmaji diwali wishes with wounded face pic.

సీనియర్ నటుడి టైమింగ్ అదిరింది

Posted: 10/29/2016 09:24 AM IST
Actor brahmaji diwali wishes with wounded face pic

కృష్ణవంశీ ప్రోత్సాహంతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన బ్రహ్మజీ స్వశక్తితోనే కెరీర్ ను కొనసాగించాడు. దాదాపు పాతికేళ్లు పూర్తి చేసుకున్న ఈ నటుడు ఈ మధ్యే సీనియర్ నటుడిగా ప్రమోషన్ కూడా పొందాడు. మరోవైపు కామిక్ టైమింగ్ పాత్రలతో కూడా మంచి గుర్తింపునే కొట్టేస్తున్నాడు. కుర్రహీరోలతో తరచూ పార్టీలు చేసుకునే బ్రహ్మాజీ ట్విట్టర్ లోనూ యాక్టివ్ గా ఉంటాడు. దీపావళి చెబుతున్నట్లుగా రీసెంట్ ఓ ఫోటోను షేర్ చేశాడు. అది చూసి షాకవ్వటం అందరి వంతు అవుతుంది.

ముఖం నిండా దెబ్బలు, రక్తపు గాయాలతో బ్రహ్మజీ ఎవరు కొట్టారంటూ ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఆరా తీస్తున్నారు. అయితే నన్నెవరూ కొట్టలేదు బాబాయ్ అంటూ.. . మొత్తుకుంటున్నాడు బ్రహ్మజీ. అవి షూటింగ్ దెబ్బలంట.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ విన్నర్ సినిమాలో బ్రహ్మజీ ఓ రోల్ పోషిస్తున్నాడు. అందులో ఓ సీన్ కోసమే మనోడు ఇలా తన్నులు తినాల్సి వస్తుందట. ఆ ఫోటోనే షేర్ చేసి దీపావళి సేఫ్ గా జరుపుకోండి. లేకపోతే ఫేస్ ఇలాగే అయిపోద్ది అన్న రీతిలో చెప్పాడన్న మాట. గతంలో బిచ్చగాడి గెటప్ లో కూడా బ్రహ్మాజీ ఓ ఫోటో పెట్టాడు. అదిరింది కదా బ్రహ్మాజీ టైమింగ్, విషెష్ చెప్పిన విధానం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Brahmaji  Blood face  Diwali wishes  

Other Articles