పండక్కి బాబాయ్ సైకిల్... అబ్బాయి బుల్లెట్ | mega family Diwali treat with posters

Mega family diwali treat with posters

Pawan Kalyan Cycle, katamarayudu on the way, Katamarayudu Cycle poster, Ram Charan Bullet Poster, Mega Family Diwali Posters, Mega Family Diwali Dhamaka, Katamarayudu diwali wishes with cycle,

Mega family Diwali treat with posters. Katamarayudu on Cycle and Charan on Bullet.

మెగా దీపావళి ట్రీట్ మిస్ కాకండి

Posted: 10/29/2016 08:36 AM IST
Mega family diwali treat with posters

పెద్ద పండగలకి స్టార్ల హీరోలు మిస్సయితే ఆ అభిమానులు ఎంతగా డిస్సాపాయింట్ అవుతారో ఇప్పుడిప్పుడే హీరోలకు తెలిసి వస్తుంది. కలెక్షన్ల పరంగా కుమ్ముకునే సీజన్ ను కావాలని ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? పరిస్థితుల దృష్ట్యా వీలు కాకపోవటంతోనే ఇలా టెక్నికల్ గా పోస్టర్లను, ఫస్ట్ లుక్ లతో అభిమానులను సంతృప్తి పరుస్తున్నారు. కోలీవుడ్ లో విజయ్, సూర్యలు అదే పని చేయగా, మన దగ్గర నాని లాంటి యంగ్ హీరోలు అదే పని చేశారు. మరి స్టార్ హీరోలు అది గమనించరా? అందుకే ఈ దీపావళి మెగా ఫ్యామిలీ ఏకంగా పోస్టర్లను వదలుతుంది.

ఈ రేసులో బాబాయ్ అబ్బాయిలు ఇద్దరూ కాస్త ముందుగానే కూసేశారు. పవర్ స్టార్ కాటమరాయుడు చిత్రం కి సంబంధించి ఓ పోస్టర్ వదిలింది చిత్ర యూనిట్. సైకిల్ మీద పంచెకట్టుతో ఇన్నోసెంట్ స్మైల్ తో వస్తున్న పవన్ ను చూస్తే ఎవరైనా ఇట్టే ఫ్లాట్ అయిపోవాల్సిందే. కోరమీసం, పంచెకట్టు కాటమరాయుడి లుక్ ఇప్పటికే తెగ వైరల్ అయిపోగా, ఈ పోస్టర్లు చూశాక ఫ్యాన్స్ సైకిల్ పట్టిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Pawan on Cycle


ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ ధ్రువ పోస్టర్ కూడా వదిలాడు. పోలీసాఫీసర్ గా చేస్తున్న విషయం ఎరుకే కదా. అందుకోసం ఇప్పటికే బుల్లెట్ పట్టిన చెర్రీ పోస్టర్ వైరల్ అవుతోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ పై డెనిమ్ బ్లూ లో, నీట్ షేవ్, కాప్ క్రాప్ తో సీరియస్ గా థింక్ చేస్తూ వస్తున్న ఆ పోస్టర్ కూడా అభిమానులకు పండగ చేస్తోంది. చెర్రీ వైఫ్ ఉపాసన కు సంబంధించిన మాగ్జైన్ బీ పాజిటివ్ లో ఈ ఫోటో పబ్లిష్ అయ్యింది. కశ్మీర్ సివిల్స్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ ఎపిసోడ్ లో భాగంగానే ఈ సీన్ ఉంటుందని సమాచారం. వీరిద్దరు అయిపోయారు ఇక మిగిలింది అన్నయ్య చిరంజీవియే. ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ వదలని ఆయన ఈసారి మాత్రం అది రివీల్ చేస్తా అని ప్రామిస్ ఇచ్చాడు. చూద్దాం బాస్ లుక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో...

Ram Charan Dhruva Bullet

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Katamarayudu Cycle  Ram Charan  Dhruva Bullet  Diwali posters  

Other Articles