ఫ్లైట్ లో టాలెంట్ చూపించిన బాలయ్య | Balayya Hul Chul in Flight with NTR dialogue.

Balayya hul chul in flight with ntr dialogue

Balayya Flight Dialogue, NTR Dialogue in Flight, Balakrishna NTR Dialogue, Balayya Flight video, Balayya in Flight with NTR Dialogue, Balayya NTR Dialogue, Balayya proves with NTR Dialogue, Balayya after NTR in Dialogue delivery, Balayya Flight Video, Balayya rocks with NTR dialogue

Balayya Hul Chul in Flight with senior NTR Dana Veera Sura Karna non stop dialogue.

బాలయ్య ఫ్లైట్ డైలాగ్ విన్నారా?

Posted: 09/27/2016 06:06 PM IST
Balayya hul chul in flight with ntr dialogue

పౌరాణిక సినిమాలంటే మనకు గుర్తొచ్చే పేరు స్వర్గీయ నందమూరి తారక రామారావు. పేజీల పేజీల డైలాగులను ఆశువుగా చెప్పటంలో ఆయన్ని మించిన వారే చెప్పాలి. అయితే ఆయన తర్వాత కొనసాగుతున్న నటావారసుల్లో బాలయ్యకి అది బాగా నప్పింది. చారిత్రక చిత్రాలంటే చాలూ పూనకం వచ్చి రెచ్చిపోయి బాలయ్య స్టేజీల మీద చెప్పే డైలాగులు వింటుంటూ ఎవరికైనా ఒళ్లు పులకరించిపోతుంది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశం చూస్తే ఎవరైనా అది ఒప్పేసుకుంటారు.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, రావణాసురుడు, భీష్ముడు, భీముడు, దుర్యోధనుడు... ఇలా అన్ని పాత్రల్లో ఎన్టీఆర్ అలరించగా, ఆయన నోటి నుంచి జారువాలిన ఏ డైలాగైనా నందమూరి బాలకృష్ణ తన దైన శైలిలో అవలీలగా చెప్పేస్తుంటాడు. తాజాగా, బాలయ్య విమానంలో డైలాగ్ చెప్పిన ఓ వీడియో రచ్చ చేస్తోంది. ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ హిట్ ‘దానవీర శూరకర్ణ’ చిత్రంలోని దుర్యోధనుడి పాత్రలోని డైలాగ్ లను బాలయ్య అలవోకగా పలకించారు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు తన ట్యాబ్ లో ‘దానవీర శూరకర్ణ’ చిత్రం చూస్తున్నాడు. నటుడు బాలకృష్ణ కూడా ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న ఆ అభిమాని వెంటనే బాలకృష్ణ పక్క సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు. క్లాసికల్ మూవీస్ అంటే తనకు ఇష్టమని, ఎన్టీఆర్ తన అభిమాన నటుడని బాలకృష్ణ కు చెప్పాడట. ఈ సందర్భంగా ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలోని ఒక డైలాగ్ ను చెప్పమంటూ బాలకృష్ణ ను ఆ అభిమాని కోరగా, బాలయ్య విజృంభించాడు.

 

ఆ ట్యాబ్ ను బాలయ్య తన చేతిలోకి తీసుకుని మరీ, కెమెరావైపు తిప్పి దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ను లిప్ సింక్ మిస్ కాకుండా గుక్కతిప్పుకోకుండా చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. రాజసం పౌరుషం ఉట్టిపడేలా డైలాగులు చెప్పే దమ్ము నందమూరి నటసింహంకి తప్ప మరెవరికి ఉంది చెప్పండి?. ప్రస్తుతం శాతకర్ణి సినిమా షూటింగ్ కాస్త విరామం ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు బాలయ్య.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna  Flight Dialogue  Dana Veera Sura Karna  

Other Articles