హీరోయిన్-దర్శకుడు... ఓ అఫైర్ | Indian Movie celebs affairs from Olden days

Bollywood affairs from olden days

Affairs in Bollywood, Bollywood Affairs, Indian Stars affairs, bollywood affairs, Indian Cinema Affairs, unknown affairs in bollywood, Secret Affairs in Bollywood, Heroine Director Affairs, bollywood star affairs

Bollywood Movie celebs affairs from Olden days.

ఆ అఫైర్లు ఎప్పటికీ హాట్ టాపికే...

Posted: 09/27/2016 12:52 PM IST
Bollywood affairs from olden days

అఫైర్లకు పుట్టినిల్లుగా మారిపోయిన సినిమా ఇండస్ట్రీలో తెర వెనుక బాగోతాల వ్యవహారాలు ఎప్పటికప్పుడు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. డేటింగ్ కల్చర్ పీక్స్ లో ఉన్న హాలీవుడ్ ను పక్కనపెట్టి, మనదేశంలో మాత్రం పెళ్లి పీటల వరకు వెళ్లేవి కొన్నే అయితే, అర్థాంతరంగా ముగుసేవి చాలా వరకు ఉన్నాయి. ఈ ట్రెండ్ ఇప్పటిదేం కాదు దశాబ్దాలుగా కొనసాగుతూనే వస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఫ్యాషన్ గా మారిపోయిన వీటివెనుక... నిజానిజాలను పక్కనబెట్టి సంచలనంగా మారిన కొన్ని హీరోయిన్-డైరక్టర్ల అఫైర్ల గురించి...

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి వచ్చిన వార్తలు బోలెడు. ఆయన మీద వచ్చే గాసిప్స్ గురించి జనాలకన్నా ఆయనకే ఎక్కువ ఆసక్తే ఉండేది. ఉర్మిళా, ఆంత్రామాలిని, నిషా కోఠారి, ఇలా అందరు హీరోయిన్లతో ఆయన ప్రేమాయణం కొనసాగించాడని వార్తలు వచ్చేవి. ఇక ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్ పై ఇలాంటి వార్తలే వస్తున్నాయి కూడా.

బాలీవుడ్ దర్శకుడు గురుదత్, నటి వహీదా రెహ్మన్ మధ్య అఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదో సంచలనం అయి కూర్చుంది. అప్పటికే గుర్ దత్ కి వివాహం జరిగింది కూడా. కానీ, వహీదాతో పీకల దాకా ప్రేమలో మునిగిపోయిన దత్ విఫలంకావటంతో తాగుడుకు బానిసై 1964లో మరణించారు.

బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత విక్రమ్ భట్ ఒకేసారి ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపారు అని మీడియా కోడై కూసింది. టాప్ హీరోయిన్లు అమీషా పటేల్, సుస్మితా సేన్ లతో ఆయన లింక్ ఉందని, ఇద్దరితో ఒకేసారి, ఒకే టైంలో డేటింగ్ చేశారని పుకార్లు షికార్లు చేశాయి. విషయం తెలుసుకున్న ఇద్దరు ఆ తర్వాత అతనితో గొడవపడి విడిపోయారంట.

మరో దర్శకుడు మనీష్ శర్మ, హాట్ బ్యూటీ పరిణితీ చోప్రా మధ్య ప్రేమవ్యవహారం నడిచేదని టాక్ నడిచింది. ఇద్దరు బోల్డెన్నీ ప్రైవేట్ మీటింగ్ లకు హాజరయ్యారని, చాలాసార్లు ఏకాంతంగా గడిపారని కూడా వార్తలు వచ్చాయి.

పాకిస్థాన్ కు చెందిన మోడల్ ఇమాన్ అలీతో అఫైర్ పెట్టుకున్నాడు దర్శకుడు ఇంతియాజ్ అలీ. ఐదేళ్ల క్రితమే పెళ్లయినప్పటికీ ఇంతియాజ్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ వార్తలతో అతని భార్య దాదాపు విడాకులు ఇచ్చిన పనిచేసింది. కానీ, చివరికి విషయం సర్దుమణగటంతో చల్లబడింది.

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దర్శకుడు సాజిద్ ఖాన్ ఎఫైర్ నడిపినట్లు, 2013లో వీరిద్దరు విడిపోయినట్లు వార్తలు వినిపించాయి.

ప్రాచీ దేశాయ్ రోహిత్ శెట్టి మధ్య జరిగిన వ్యవహారం కూడా అందరికీ తెలిసిందే. ఎన్ని విమర్శలు వచ్చినా వారిద్దరు నోరు విప్పకపోవటంతో ఆ వార్త అప్పట్లో బాగానే జనాల నోళ్లలో నానింది.

మరో బ్యూటీ మహిగిల్ గురించి తెలియని వారుండరు. డైరక్టర్ దూలియాతో ప్రేమ వ్యవహారం నడిపిన ఆమె పెళ్లిదాకా వెళ్లి విడిపోయారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇక విడిపోయిన జంటలే కాదు, పెళ్లి అనే బంధంతో ఒకటైన ప్రేమలు కూడా ఉన్నాయండోయ్

దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నటి కల్కీ కొచ్చిన్ ని. దేవ్ డీ చిత్ర సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించటం, ఆపై విడాకులు తీసుకోవటం కూడా జరిగాయి. నటి హుమా ఖురేషీ వారిద్ధరి మధ్య చిచ్చు పెట్టినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆమెతో అనురాగ్ డేటింగ్ లో ఉన్నట్లు బోగట్టా.


ఇవేకాదు నటీనటుల విషయంలో అమితాబ్ బచ్చన్, రేఖ, సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్-కరిష్మా కపూర్, షాహిద్ కపూర్-కరీనా కపూర్, హృతిక్ రోషన్-బార్బరా మోరీ, కరీనా కపూర్, కంగనా రానౌత్, బిపాసాబసు-జాన్ అబ్రహాం, షారూఖ్ -ప్రియాంక చోప్రా, సంజయ్ దత్-మాధురీ దీక్షిత్, అక్షయ్ కుమార్-శిల్పా శెట్టి, రవీనా టండన్, మిథున్ చక్రవర్తి-శ్రీదేవి, సంజయ్ ఖాన్-జీనత్ అమాన్, శతృఘ్న సిన్హా- రీనా రాయ్, కమల్-సారిక, సంజీవ్ కుమార్-హేమా మాలిని, రాజ్ కపూర్-నర్గీస్ (సునీల్ దత్ భార్య), దేవానంద్-సూరయ్యా, మధుబాల-దిలీప్ కుమార్ ల ప్రేమ వ్యవహారాల్లో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయో తెలీదుగానీ, అప్పట్లో సంచలనాలుగా మాత్రం మారాయి. మొత్తానికి ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టినా, కెరీర్ పరంగా మాత్రం వారంతా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Bollywood  Affairs  India Cinema  

Other Articles