రకుల్ పెద్ద సినిమాలు కథ వినకుండానే ఒప్పేసుకుంటుందట | Rakul accept big star movies without story hearing

Rakul about movie selection

Rakul Preet Singh movie selection, Rakul about movie offers, How Rakul accept big star movies

Rakul Preet says she accept big star movies without hearing story line.

రకుల్ లాజిక్ భలేగా ఉందే

Posted: 08/12/2016 06:53 PM IST
Rakul about movie selection

టాలీవుడ్ లక్కీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల ఎంపికలో కొన్ని లెక్కలుంటాయంట. వాటి ప్రకారమే తాను కొత్త సినిమాలను ఒప్పుకుంటానంటోంది. ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేముందు అమ్మడికి ఆ కథ నచ్చాలి. అయితే, ఇది అన్ని వేళలా కాదులెండి. ఒక్కోసారి కథ ఏమిటి? అని అడగకుండా కూడా ఒప్పేసుకుంటుందంట.

అది ఎప్పుడు? అని అడిగితే మొత్తం గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తుంది "టాప్ హీరో, టాప్ డైరెక్టర్ కాంబినేషన్లో ఓ ఆఫర్ వచ్చిందనుకోండి. ఇక అప్పుడు కథేమిటి? నా పాత్రేమిటి? అన్నదే అడగను. డేట్స్ వుంటే వెంటనే ఇచ్చేస్తాను. అసలు అలాంటి కాంబినేషన్ లో సినిమాకి కూడా ఇవన్నీ అడగాలా? ఎందుకంటే, అసలు ఎంతో కసరత్తు చేసి... కథ అందరికీ నచ్చితేనే కదా అలాంటి సినిమా సెట్స్ కి వెళుతుంది. అలాంటి సందర్భాలలో కూడా కథ ఏమిటి? ఎన్ని సీన్లు వుంటాయి? అని అడగడం అవివేకం కదా?" అంటోంది ఈ ముద్దుగుమ్మ.

ఆ విధంగా పెద్ద హీరోలను, పెద్ద డైరెక్టర్లను ఆమె ఆకాశానికెత్తేస్తోంది. మొత్తానికి టాలీవుడ్ కి వచ్చాక రకుల్ తెలివి బాగా నేర్చేసిందనే అనుకోవాలి మనం! మహేష్ సినిమాలో ఆఫర్ వచ్చింది కదా అందుకే ఆగట్లేదు పాప. జాగ్రత్తమా! బ్రూస్ లీ ఇచ్చిన రిజల్ట్ మరిచిపోకు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  about  big star  movies  

Other Articles