బాబు బంగారాన్ని 8 నిమిషాలు కోసేశారు | babu bangaram trimmed by 8 minute before release

Babu bangaram trimmed by 8 minute before release

Venky Babu bangaram trimmed, Babu bangaram Trimmed, trimmed sentiment for babu Bangaram, venky babu bangaram, Babu Bangaram movie length, Babu Bangaram running time

Venky Babu bangaram trimmed by 8 minute before releas

బాబు బంగారం అలాగైనా లక్ దక్కాలి

Posted: 08/11/2016 10:40 AM IST
Babu bangaram trimmed by 8 minute before release

మాస్ తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇప్పటికీ మెయింటెన్ చేస్తున్న విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా గ్యాప్ తర్వాత రాబోతున్న చిత్రం బాబు బంగారం. యూత్ ఫుల్ దర్శకుడు మారుతితో మాంచి కామెడీ సబ్జెక్ట్ ఫ్లస్ యాక్షన్ ఎంటైర్ టైనర్ గా దీన్ని  తీర్చిదిద్దాడు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొన్న ఈ చిత్రానికి మరో న్యూస్ ఇంకాస్త అంచనాలను పెంచేస్తుంది.

బాబు బంగారం అలాగైనా లక్ దక్కాలి 

ఈ చిత్రాన్ని 8 నిమిషాలు కోత వేసినట్లు తెలుస్తోంది. సినిమా రన్నింగ్ టైం మరీ ఎక్కువగా ఉందని భావించిన దర్శకుడు మారుతి, హీరో వెంకటేష్, ఎడిట్ రూంలో దగ్గరుండి మరీ చిత్రానికి ట్రిమ్ చేయించారంట. ఆపై చిత్ర అవుట్ ఫుట్ చూసి సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో ఇలా రిలీజ్ కు ముందే కోతలు పడ్డ చిత్రాలు హిట్లు అయిన దాఖలాలు ఉన్నాయి. రామ్ నేను శైలజతోపాటు నితిన్ అ..ఆ... లు రిలీజ్ కు నిడివి ఎక్కువగా ఉండటంతో స్లోగా ఉందనే నెగటివ్ టాక్ వచ్చాయి. ఇప్పడు బాబు బంగారానికి కూడా అలాంటి టాక్ రావటంతో ఈ పని చేశారఒఈంట.

Babu Bangaram Movie Review

కానీ, ట్రిమ్ చేసిన తర్వాత ఆ చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో మనకు తెలిసిందే. దీంతో బాబు బంగారానికి కూడా ఈ కోత సెంటిమెంట్ కలిసోస్తుందని వారు భావిస్తున్నారు. అయితే ఈ మధ్య సర్దార్ గబ్బర్ సింగ్ లు, బ్రహ్మోత్సవం సినిమాలు ట్రిమ్ చేసిన ఎలాంటి ఫలితాలు ఎదుర్కున్నాయో ఎరుకే కదా. కానీ, రిలీజ్ అయి బ్యాడ్ టాక్ వచ్చాక ఆ పని చేయటంతో అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందిలేండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Venkatesh  babu bangaram  trim  censor  Maruthi  Nayanatara  

Other Articles