దీపికా, సమంత జిమ్ వర్కవుట్ వీడియోలు | deepika and samantha workout videos viral

Deepika and samantha workout videos viral

Deepika Padukone, Samantha Gym video

Deepika Padukone and samantha Ruth Prabhu workout videos viral.

మొన్న దీపిక, నిన్న సమంత ఏంటిది?

Posted: 08/11/2016 11:09 AM IST
Deepika and samantha workout videos viral

ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా ఫిట్ నెస్ మంతాన్ని జపిస్తున్నారు. ఆ వుడ్ ఈ వుడ్ అనే తేడా లేకుండా ముఖ్యంగా హీరోయిన్లు చాలా కష్టపడుతున్నారు. వయసు పై బడుతున్నా షేపులు చెక్కుచెదరకుండా ఫిజిక్ ను మెయింటెన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓ ఇద్దరు హీరోయిన్లు తమ వీడియోలను నెట్ లో అప్ లోడ్ చేసి తామెంత కష్టాలు పడుతున్నామో చెప్పకనే చెప్పారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది పొడుగుకాళ్ల బ్యూటీ దీపికా పదుకునే.

విన్ డిజీల్ సరసన ట్రిపుల్ ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ జాండర్ క్రేజ్ చిత్రంతో హాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ ఆ సినిమా కోసం చాలానే కష్టపడింది. సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ కోసం తన ఫిజిక్ ను పూర్తిగా మార్చుకుంది. సిక్స్ ప్యాక్ దేహంతో, హీరోల మాదిరిగా ఫైట్స్ చేసి అలరించింది. మరి ఇందుకోసం దీపిక కూడా గంటల తరబడి జిమ్ముల్లో వర్కవుట్స్ చేసిన దీపు ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తోంది. వివిధ రకాల కసరత్తులు చేస్తూ ఉన్న  ఆ వీడియోను నెట్ లో అప్ లోడ్ చేసింది. వర్కవుట్స్ కోసం దీపిక పడుతున్న కష్టం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆమె పడుతున్న కష్టం చూస్తే ఎవరైనా పాపం అనాల్సిందే.

ఇక మరో నటి సమంత విషయానికొస్తే.... సినిమాలు అస్సలు ఒప్పుకోకుండా ప్రస్తుతం ఖాళీగానే ఉన్న ఈ చెన్నై బ్యూటీ జిమ్ లో తెగ జిజీగా గడిపేస్తుంది. పెళ్లికి కాస్త టైం ఉన్నా ఫర్వాలేదుగానీ జిమ్ ను మాత్రం అస్సలు వదలనంటోంది. చేతిలో డంబుల్స్ పట్టుకుని.. ఒక చేతిపై అనించి మరోవైపు డంబుల్ ఉన్న చేతిని అలా పైకెత్తుతుంటే.. అమ్మో అనిపించడం లేదూ.. ఇదంతా బాడీలో కాలి వేళ్లు తప్ప ఏ భాగం నేలకు తాకకుండానే ఇంతలేసి పుషప్స్ చేసేస్తోంది.

ఇలా ఈ ఇద్దరు సెలబ్రిటీస్ ల వీడియోలు పోస్ట్ చేయటం కొత్తేమీ కాదు. వీరి వర్కవుట్స్ కు సంబంధించిన వీడియోలు పోస్టు చేయడంలో ఒక మంచి ఉద్దేశం ఉందనే అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్న ఈ ఇద్దరు సెలబ్రిటీస్ ఆ వీడియోస్ ఫిజికల్ ఫిట్ నెస్ పై ఎంతోమందిని ప్రభావితం చేస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలా అని వారు చేసినట్లే చేయాలని రూల్ ఏం లేదు లేండి. ఎవరి ఫిట్ నెస్ లెవల్ బట్టి వారు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles