బాబు బంగారం రివ్యూ | babu bangaram movie review

Teluguwishesh బాబు బంగారం బాబు బంగారం Venkatesh Babu Bangaram movie Review. Product #: 76991 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    బాబు బంగారం

  • బ్యానర్  :

    సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

  • దర్శకుడు  :

    మారుతి

  • నిర్మాత  :

    సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ-పీడీవీ.ప్ర‌సాద్‌

  • సంగీతం  :

    జిబ్రాన్‌

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    రిచర్డ్ ప్రసాద్

  • ఎడిటర్  :

    ఉద్ద‌వ్‌.ఎస్‌.బి

  • నటినటులు  :

    విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార, సంపత్, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ ముర‌ళి, పృథ్వి, జ‌య‌ప్ర‌కాష్‌, ర‌ఘుబాబు త‌దిత‌రులు

Babu Bangaram Movie Review

విడుదల తేది :

2016-08-12

Cinema Story

ఏసీపీ కృష్ణ ఓ సిన్సియర్ అండ్ సరదా పోలీస్. కొన్ని విషయాల్లో అమాయకత్వం ప్రదర్శించినప్పటికీ, అన్యాయం జరుగుతుంటే మాత్రం చీల్చి చెండాడే టైపు. ఓ మర్డర్ కేసులో కీలక సాక్షి అయిన ఓ వ్యక్తి(మురళి శర్మ) ను పట్టుకునే పనిని కృష్ణకు అతనికి అప్పజెప్పుతారు. ఆ క్రమంలోనే అతని కూతురు సెల్వి(నయనతార) ను ఫాలో అవుతూ ఆమె ప్రేమలో పడిపోతాడు. 

 

కృష్ణ నచ్చటంతో ఆమె కూడా అందుకు ఓకే చెబుతుంది. కానీ, అదంతా డ్రామా అని, తన తండ్రిని పట్టుకునేందుకు తనకు కృష్ణ గాలం వేశాడని సెల్వి అనుకుని పొరబడుతుంది. ఇక ప్రేమ బ్రేకప్ అయినప్పటికీ కేసు విషయం మాత్రం కృష్ణ అస్సలు వెనక్కి తగ్గడు. అసలైన నిందితుల భరతం పట్టడంతోపాటు తన ప్రేమను తిరిగి ఎలా సాధించుకుంటాడు అన్నదే కథ.  

cinima-reviews
బాబు బంగారం

షాడోతో భయపెట్టిన వెంకీ ఆ తర్వాత మాస్ పాత్రల జోలికి పోలేదు. టోటల్ గా సాఫ్ట్ రోల్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో వెంకీ లోని కామెడీ టైమింగ్ తోపాటు, మాస్ యాంగిల్ ను మళ్లీ బయటికి తీసేందుకు యంగ్ డైరక్టర్ మారుతి చేసిన యత్నమే బాబు బంగారం. బొబ్పిలి రాజా ఈజ్ బ్యాక్ అంటూ పక్కా కమర్షియల్ ఎంటర్ టైన్ గా తెరకెక్కిన ఈ చిత్రం రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

విశ్లేషణ:

రోటీన్ కథనే ఎంచుకున్నప్పటికీ వెంకీతో చాలా గ్యాప్ తర్వాత ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్ మెంట్ పాత్రలో చూపించాలన్న మారుతి ఆలోచన వర్కవుట్ కాలేదు. కథ సింపుల్ దే అయినప్పటికీ సోలోగా వెంకీ తో సినిమాను సరదాగా సాగిపోయేలా తీద్దామనుకున్న ప్రయత్నం బెడిసి కొట్టింది. ట్విస్ట్ లు, అద్భుతమనిపించే సీన్లు ఏం లేకపోయినప్పటికీ ఉన్నంతలో హీరో రిఫ్రెషింగ్ క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు. డైలాగులు కూడా డబుల్ మీనింగ్ లు లేకుండా నీట్ గా కానిచ్చేశాడు. అయితే ప్రేమకథ, కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఎంత పాస్ట్ గా ఎంటర్ టైనింగ్ సాగిపోతుందో... కథేమీ లేకపోయినా సెకండాఫ్ అంత సీరియస్ గా, స్లోగా ఉంటుంది. కానీ, క్లైమాక్స్ లో మళ్లీ వెంకినీ, కామెడీని వాడటంతో ప్రేక్షకుడు హ్యాపీగా ఫీలవుతాడు.

ఇక నటీనటుల విషయానికోస్తే అప్పుడెప్పుడో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తర్వాత మళ్లీ ఇప్పడు వెంకీ యాక్టింగ్ లో తనదైన ముద్ర వేశాడు. ఓవైపు సీరియస్ కాప్ రోల్ లో నటిస్తూనే, ఫన్నీ మార్కుతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వెంకీ యాక్షన్, కామెడీ పీక్స్ లోకి వెళ్లిపోతుంది. అయితే కథ మొత్తం వెంకీ వన్ మ్యాన్ షో నడిపించాలనుకోవటం మాత్రం అస్సలు సూట్ కాలేదు. ఇక నయనతార లుక్స్ పరంగా బాగున్నప్పటికీ, యాక్టింగ్ స్కోప్ లేకుండా పోయింది. కాకపోతే గత చిత్రాల మాదిరిగానే ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. వీరి తర్వాత అసలు క్యారెక్టర్ మొత్తం ఆక్రమించుకున్నాడు థర్టీ ఇయర్స్ పృథ్వీ. అమ్మ నా బత్తాయో అంటూ బత్తాయి బాబ్జీ క్యారెక్టర్ లో బాగా నవ్వించాడు. మిగతా వాళ్లలో వెన్నెల కిషోర్ మిగతా కానిస్టేబుళ్లు అలరించారు. మురళిశర్మ, విలన్ గా సంపత్ రాజ్ లది రెగ్యులర్ పాత్రలే కాగా, పోసాని ఓవర్ కామెడీ, బ్రహ్మనందం పూర్తిగా నిరాశపరిచారు.

టెక్నికల్ గా జిబ్రాన్ అందించిన సంగీతం ఫ్లస్. అదే సమయంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కాస్త వయోలెంట్ గా అనిపించక మానదు. మారుతి అందించిన డైలాగులు బావున్నాయి. ముఖ్యంగా వెంకీ, పృథ్వీ క్యారెక్టర్లకు స్పెషల్ కేర్ తీసుకున్నాడు. కెమెరా వర్క్ రిచ్ గా ఉంది. అగ్రహీరో కావటంతో నిర్మాణ విలువలు ఏ మాత్రం తగ్గకుండా తీశారు.

 

ఫస్ల్ పాయింట్లు:
వెంకీ, పృథ్వీ ల క్యారెక్టర్లు
ఫుల్లీ కామెడీతో నిండిపోయిన ఫస్టాఫ్
డైలాగులు
పాటలు

 

మైనస్ పాయింట్లు:
సాగదీసిన సెకండాఫ్
లౌడ్ నెస్ ఎక్కువైన బ్యా గ్రౌండ్ స్కోర్
ట్విస్ట్ లు లేని రెగ్యులర్ కథ

తీర్పు
హ్యుమర్ తో నిండిన ప్రేమ కథగా తెరకెక్కిన బాబు బంగారం ఫస్టాఫ్ వరకు బాగా ఉన్నప్పటికీ సెకండాఫ్ లోనే సీరియస్ నెస్ కాస్త ఎక్కువైనట్లు అనిపించకమానదు. వెంకీ లాంటి సీనియర్ హీరోని మారుతి సగం మాత్రమే హ్యాండిల్ చేయగలిగాడు. అదే టైంలో కామెడీ పిండటంలో కూడా పూర్తిగా విఫలమయ్యాడు. బాబు బంగారం అద్భుతాలు ఏం చేయలేదు, అలాగని నిరాశకు కూడా గురిచేయలేదు.

చివరగా... బాబు బంగారం అయ్యో.. అయ్యో... అయ్యాయో!

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.