పెళ్లి చూపులు హీరోయిన్ పై తమ్మారెడ్డి వ్యాఖ్యలు | Tammareddy criticizes Ritu Varma as Chandalam

Tammareddy criticizes ritu varma as chandalam

Tammareddy criticizes Ritu Varma, Tammareddy comments on ritu varma, pelli choopulu heroine Ritu Varma

Tammareddy says he criticized Ritu Varma as Chandalam before Pelli Choopulu release. But, After watching movie his opinion was completely changed and connect to her character only.

తమ్మారెడ్డి దృష్టిలో చెండాలం అనిపించుకున్నదెవరు?

Posted: 08/05/2016 10:31 AM IST
Tammareddy criticizes ritu varma as chandalam

సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఇండస్ట్రీలో ముక్కుసూటి తనానికి మారు పేరు. ఏ విషయం అయినా సరే ముఖం మీదే లాగి కొట్టినట్లు చెప్పేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసే క్రమంలో పెద్ద సినిమాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన రోజులూ ఉన్నాయి. అలాంటిది ఒక హీరోయిన్ ను పట్టుకుని ఆమె ముఖం మీదే చెండాలంగా ఉంది అంటే ఎలా ఉంటుంది?. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే పెళ్లిచూపులు సక్సెస్ మీట్ లో చెప్పాడు. 

ఇటీవలె విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో సంచనాలు సృష్టిస్తున్న కలెక్షన్లతో దూసుకుపోతుంది పెళ్లి చూపులు సినిమా. అయితే విడుదలకు ముందు తమ్మారెడ్డి ఆశీస్సుల కోసం చిత్ర యూనిట్ అంతా ఆయన్ను కలిసిందట. ఆ టైంలో హీరోయిన్ రీతూవర్మను చూసి ఆయన ఇంత చెండాలంగా ఉంది, ఏం నటిస్తుంది అని భావించాడంట. కానీ, సినిమా విడుదలయ్యాక తన ఒపీనియన్ పూర్తిగా మారిపోయిందని, సినిమాలో రీతూ క్యారెక్టర్ కి తాను కనెక్ట్ అయిపోయానని చెప్పుకోచ్చాడు.

ఇక చిన్న చిత్రంగా వచ్చిన పెళ్లి చూపులకు రాను రాను స్పందన గణనీయంగా పెరిగిపోతుంది. టాప్ ఫిల్మ్ మేకర్స్ అంతా చిత్రాన్ని పొగిడేస్తుడటంతో ఆ మౌత్ టాక్ తో స్క్రీన్ల సంఖ్యను పెంచేస్తున్నారు. సక్సెస్ మీట్ లో దాసరి లాంటి సీనియర్ దర్శకుడు తనకు బాహుబలి కంటే పెళ్లిచూపులు నచ్చిందని చెప్పటం సినిమాలో ఉన్న మ్యాటర్ గురించి చెప్పకనే చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamma Reddy  Pelli choopulu  Success meet  Ritu Varma  Comments  

Other Articles