సుమంత్ ‘రైట్ రైట్‘ టీజర్ విడుదల | Right Right Teaser Released

Right right teaser released

Right Right Official Teaser, Right Right Movie Shooting Completed, సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పూజా జవేరి, Right Right Movie updates, Right Right Movie details, Right Right Movie stills, Right Right Movie news, వార్తలు, ఫోటోలు, గాసిప్స్, రాజకీయాలు, Right Right Movie teaser, Right Right Movie posters, Right Right, Sumanth Ashwin

Right Right Teaser Released: Starring Sumanth Ashwin, Bahubali Prabhakar, Pooja Jhaveri. This film shooting completed. Music JB, Producer J. Vamsi Krishna, Director Manu.

సుమంత్ ‘రైట్ రైట్‘ టీజర్ విడుదల

Posted: 04/19/2016 09:41 AM IST
Right right teaser released

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఆర్డినరీ’ చిత్రాన్ని తమిళంలో ‘జన్నల్ ఓరమ్’ పేరుతో రీమేక్ చేసారు. తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. ఇపుడు ఇదే చిత్రాన్ని తెలుగులో ‘రైట్ రైట్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో యువ నటుడు సుమంత్ అశ్విన్, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. పూజా జవేరి హీరోయిన్.

మను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని అరకు, ఒడిశా, కేరళ, వికారాబాద్ ఫారెస్ట్ వంటి అందమైన ప్రాంతాల్లో చిత్రీకరించారు. ట్రైలర్ బాగుంది. తెలుగు నెటివిటీకి తగ్గట్లుగా పలు మార్పులు చేసినట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జె.బి. సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేసి, జూన్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

నాజ‌ర్‌, ధ‌న‌రాజ్‌, `ష‌క‌ల‌క` శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, జీవా, రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌త్‌రెడ్డి, వినోద్‌, పావ‌ని, క‌రుణ‌, జ‌య‌వాణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాట‌లు: శ్రీమ‌ణి, కెమెరా: శేఖ‌ర్ వి.జోస‌ఫ్‌, మాట‌లు: `డార్లింగ్‌` స్వామి, ఆర్ట్ : కె.ఎమ్‌.రాజీవ్‌, కో ప్రొడ్యూస‌ర్‌: జె.శ్రీనివాస‌రాజు, నిర్మాత‌: జె.వంశీకృష్ణ‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌ను, స‌మ‌ర్ప‌ణ‌: వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు.​

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sumanth Ashwin  Right Right  Prabhakar  

Other Articles