Gold to Reach $3,000: Bank of America కరొనా తాకిడితో స్వర్ణానికి రెక్కలు.. త్వరలో రెట్టింపు ధర..

Gold to reach 3 000 50 above its record bank of america says

BANK OF AMERICA CORP, Generic 1st 'GC' Future, Gold Rate, ounce gold, future gold rating, double in year, Federal Reserve, Coronavirus, Michael Widmer, US DollarSpot, India, China, Markets, Finance, markets, Asia Economy, business news, Indian Economy, financial news

Bank of America Corp. raised its 18-month gold-price target to $3,000 an ounce -- more than 50% above the existing price record -- in a report titled “The Fed can’t print gold.” The bank increased its target from $2,000 previously. BofA expects bullion to average $1,695 an ounce this year and $2,063 in 2021. The record of $1,921.17 was set in September 2011.

కరొనా తాకిడితో స్వర్ణానికి రెక్కలు.. త్వరలో రెట్టింపు ధర..

Posted: 04/23/2020 09:06 PM IST
Gold to reach 3 000 50 above its record bank of america says

కరోనా వైరస్‌ మహమ్మారితో జంతుజాలానికి, పర్యావరణానికి మేలు జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో మానవాళి మనుగడకు మాత్రం సవాల్ లా పరిణమించింది. అయితే ఈ మహమ్మారి విస్తరిస్తూ, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, సురక్షిత పెట్టుబడి సాధనం అయిన బంగారంపైకి పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని, భవిష్యత్తులో ధర గణనీయంగా పెరగవచ్చని బీఓఎఫ్‌ఏ (బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా) సెక్యూరిటీస్‌ విశ్లేషించింది.

రానున్న 18 నెలల వ్యవధిలో ఔన్సు బంగారం (31.10 గ్రాములు) ధర 3,000 డాలర్లకు చేరొవచ్చునని అంచాన వేసింది. కొవిడ్‌-19 వల్ల మదుపరుల్లో నష్ట భయం పెరిగిపోయింది. అందువల్ల పసిడికి అనూహ్య గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది,  కాబట్టి ఔన్సు బంగారం ధర 3,000 డాలర్లకు పెరగొచ్చునని విశ్లేషించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1710 డాలర్లు పలుకుతోంది. ఇంతకు ముందు ఇదే సంస్థ వచ్చే ఏడాదిన్నర కాలానికి ఔన్సు బంగారం ధర 2,000 డాలర్లకు పెరగవచ్చని అంచనా వేసింది. ఇప్పుడు దాన్ని సవరించింది.

ప్రస్తుతం డాలర్‌ మారకపు విలువ రూ.76పైన ఉంది. బీఓఎఫ్‌ఏ అంచనాలకు అనుగుణంగా పసిడి విలువ పెరిగినపుడు, ప్రస్తుత డాలర్‌ విలువ ప్రకారం లెక్కిస్తే... 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.73,000 చేరుకుంటుందని అంచనా. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే బంగారానికి ఎన్నడూ లేనంత గిరాకీ రాబోతోందని స్పష్టమవుతోంది. వాస్తవానికి బంగారం ధర ఎంతగా పెరిగితే, అంతగా ఆభరణాలు కొనుగోలు చేసే వారు తగ్గిపోతున్నారని ఆభరణాల విక్రయదార్లు పేర్కొంటున్నారు. పైగా ఏదైనా కేంద్రబ్యాంక్‌ కనుక బంగారాన్ని విక్రయానికి పెడితే, ధర మళ్లీ బాగా తగ్గడం ఖాయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles