Facebook invests $5.7 billion in Jio Platforms రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ వాటాలు కొనుగోలు..

Facebook takes 5 7 billion stake in india s jio platforms

Asia Economy, Facebook, Reliance Jio, Reliance Industries Ltd, Technology, Internet, Social media, India, WhatsApp, Mukesh Ambani, Mark Zuckerberg, Telecommunications, Telecommunications services, business news, Indian Economy, financial news

Facebook has made a $5.7 billion investment in Jio Platforms Limited, owned by Reliance Industries, a massive Indian conglomerate. Jio Platforms has a number of brands under it including its telecommunications business Reliance Jio which has grown rapidly thanks to competitive pricing to become the number one mobile carrier in India.

రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ భారీ పెట్టుబడులు.. 9.99శాతం వాటా..

Posted: 04/22/2020 05:32 PM IST
Facebook takes 5 7 billion stake in india s jio platforms

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్‌ భారీ పెట్టుబడులను పెట్టనుంది. జియో ప్లాట్ పామ్స్ లో 9.99శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. దీని విలువ రూ.43,574 కోట్లు. ఈ మేరకు ఇరు సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. తాజా వాటా కొనుగోలుతో జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఫేస్‌బుక్‌ నిలవనుంది. భారత్లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న టెలికాం సంస్థ రిలయన్స్ జియో.‌. 2016లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2016 నుంచి నాలుగేళ్ల కాలంలో 38.8 కోట్ల వినియోగదారుల్ని తన కస్టమర్లుగా మార్చుకుంది.

‘‘భారత్‌లోని చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనివ్వాలన్నదే మా లక్ష్యం. ముఖ్యంగా దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఆరు కోట్ల చిన్న తరహా వ్యాపారాలకు అండగా నిలవాలని అనుకుంటున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారిని ఏకం చేయాలనుకుంటున్నాం. కరోనా సంక్షోభం తర్వాత.. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, దానికి జియో, ఫేస్ బుక్ బంధం బాటలు వేస్తుందని భావిస్తున్నాం’’ అని రిలయన్స్‌ ఈ సందర్భంగా పేర్కొంది.

భారత్‌లో డిజిటల్‌ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని దీనిలో భాగం కావాలన్న లక్ష్యంతోనే జియోతో జతకడుతున్నామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ఈ బంధం భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా దూసుకెళ్లేందుకు.. ప్రజలకు మెరుగైన వసతుల్ని అందించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు మరింత సమర్థంగా పనిచేసేలా మార్గాలు రూపొందిస్తామని తెలిపింది. ప్రతిభగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారత్‌ నిలయంగా ఉందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles