Zomato acquires Uber Eats in an all-stock deal జొమాటోలో ఊబర్ ఈట్స్ విలీనం..

Uber eats out of food apps race as zomato acquires the app

uber eats, zomato acquire uber eats, uber eats acquired by zomato, zomato, uber acquires zomato, uber zomato deal, zomato uber deal, zomato uber new company, uber eats, zomato, food delivery company, swiggy, madhya pradesh, kerala, Tamil Nadu, Business, Economy

Alibaba's Ant Financial-backed online food delivery and restaurant discovery platform Zomato has acquired Uber Eats, the food delivery business of ride-hailing giant Uber India for around Rs 2,485 crore ($350 million) in an all-stock deal. The deal gives the ride-hailing app a 10 per cent stake in Zomato.

ఆహార సరఫరా దిగ్గజ సంస్థ జొమాటోలో ఊబర్ ఈట్స్ విలీనం..

Posted: 01/21/2020 07:40 PM IST
Uber eats out of food apps race as zomato acquires the app

భారతీయ ఆహార సరఫరా దిగ్గజం జొమాటో దేశీయ మార్కెట్లో మరింతగా వేళ్లూనుకునే ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. అమెరికన్‌ ఆన్ లైన్‌ ఆహార సంస్థ ఉబెర్‌ ఈట్స్ ను జోమాటో తనలో విలీనం చేసుకుంది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు దాదాపు రూ.2500 కోట్ల విలువైన వ్యాపార ఒప్పందం చేసుకొన్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఉబెర్ కు జొమాటోలో 9.9శాతం వాటా లభించింది. అంతేకాకుండా ఉబెర్‌ ఈట్స్‌ వినియోగదారులందరినీ జొమాటోకు బదలాయించారు.

అయితే ఉబెర్‌ ఈట్స్‌ ఉద్యోగులను మాత్రం జొమాటో స్వీకరించదట. భారత్‌లో పనిచేస్తున్న 100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు పదవీ విరమణ ఇవ్వడంగానీ, లేదా వేరే విభాగాలకు మళ్లిస్తారు. ‘‘భారత్‌లో మా ఆహార సామ్రాజ్యాన్ని స్థాపించి దానిని 500 పైగా నగరాలకు విస్తరించినందుకు గర్విస్తున్నాం. మా తాజా కొనుగోలుతో ఆహార సరఫరా రంగంలో మా స్థానం మరింత బలోపేతం కానుంది’’ అని జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ ప్రకటించారు.

మరోపక్క ‘‘2017లో మేము భారత అన్‌లైన్‌ ఆహార రంగంలో ప్రవేశించాము. జొమాటోలో విలీనంతో ఈ రోజు మా ప్రయాణం ఒక కొత్త మలుపు తీసుకుంది. దీంతో ఇక భారత్ లో ఉబెర్‌ ఈట్స్‌ సేవలు లభ్యం కావు. మా వినియోగదారులకు రానున్న రోజుల్లో చక్కటి ఆహారంతో మరింత సంతోషం లభించాలని కోరుకుంటున్నాం’’ అని తన ఉబెర్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ప్రకటించింది. దీంతో ఉబెర్‌ ఈట్స్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్‌, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాలలో జొమాటోకు గట్టి పట్టు దక్కనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uber eats  zomato  food delivery company  swiggy  madhya pradesh  kerala  Tamil Nadu  zomato uber deal  Business  Economy  

Other Articles