Markets back on track; Nifty closes above 8100 mark

Nifty ends below 8150 sensex up 122 pts fmcg stocks gain

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

The broader markets also gained with the BSE Midcap and Smallcap indices rising 0.4-0.8 percent. About two shares advanced for every share falling on the Bombay Stock Exchange.

‘బ్రెగ్జిట్’ ప్రభావాన్ని అధిగమించిన మార్కెట్లు.. 8150 మార్కు దిగువన నిఫ్టీ

Posted: 06/28/2016 04:40 PM IST
Nifty ends below 8150 sensex up 122 pts fmcg stocks gain

బ్రిగ్జిట్ ప్రభావంతో గత రెండు రోజులుగా మందగమనంలో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల ఫలితాలతో లాభాలను అర్జించింది. ఇవాళ కూడా తీవ్ర ఒడిదొడుకులకు లోనైన మార్కెట్లు మధ్యానానంతర సెషన్లో మాత్రం లాభాలలో దూసుకెళ్లి.. ఒడిచి పట్టుకుంది. దీంతో లాభాలతోనే మార్కెట్లు ముగిసాయి. ఇవాళ ఉదయం మార్కెట్ ప్రీ-ఓపెన్ సెషన్ నుంచి లాభాల బాటలో పయనించిన సూచీలు ముగింపులోనూ లాభాల అర్జనను చేశాయి.

ఇవాళ ఉదయం ప్రారంభంతోనే లాభాల బాటలో పయనించిన సూచీలు తటస్థస్థాయిని కనబర్చాయి. సెస్సెక్స్ స్వల్ప లాభంతో 8 పాయింట్లు, నిఫ్టీ 8100 మార్కుకు ఎగువన తెరుచుకున్నాయి. ఆ తరువాత ఉదయం పదకోండు గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 70 పాయింట్ల లాభాన్ని అర్జించింది. దీంతో సెన్సెక్స్ ఆరంభంలోనే 26,473 పాయింట్లకు చేరుకుని క్రమంగా లాభాల బాటలో పయనించింది. అటు నిఫ్టీ కూడా 21 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ మాత్రం 8100 మార్కును నిలబెట్టుకుంది,

అటు నుంచి క్రమంగా మధ్యాహ్నం ఒంటిగంటకు 100 పాయింట్లను అర్జించిన సెన్సెక్స్ ముగింపులో 122 పాయింట్లను అర్జించింది. అటు నిఫ్టీ కూడా 33 పాయింట్ల లాభాన్ని అర్జించి 8150 మార్కుకు దిగువన ముగిసింది. ఇవాళ్లి ట్రేడింగ్ లో మొత్తంగా 1579 సంస్థలకు చెందిన షేర్లు లాభాలను అర్జించగా, 1020 సంస్థలకు చెందిన షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా 189 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి. ఈ క్రమంలో ఎఫ్ ఎం సీ జీ, హెల్త్ కేర్, చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య, మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్ లకు చెందిన సూచీలు భారీగా లాభాలను అర్జించాయి.

అటో, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మద్య తరహ పరిశ్రమల సమాఖ్యల సూచీలు స్వల్ప లాభాలను అర్జించాయి. కాగా ఐటీ, టెక్నాలజీ, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీలు మాత్రం నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో లెపిన్, ఐడియా సెల్యూలార్, హెచ్ యు ఎల్, భారతి ఇన్ఫ్రాటెల్, బాస్చ్ తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, హెచ్ సి ఎల్ టెక్, టాటా మోటార్స్ (డీజిల్), టాటా మెటార్స్ , హిండాల్కో, టీసీఎస్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles