Who is the one to take charge as RBI governor out of four?

India cuts rbi governor shortlist to four officials say

India, RBI governor, shortlist of four, new monetary policy committee, Urjit Patel, Rakesh Mohan, Subir Gokarn, Arundhati Bhattacharya, Arun jaitley, PM Modi, RBI Deputy Governor Urjit Patel, former deputy governor Rakesh Mohan, former deputy governor Subir Gokarn, SBI Chairperson Arundhati Bhattacharya.

The government has narrowed down its list of candidates to become the next governor of the Reserve Bank of India (RBI) to four, a senior government official told Reuters.

ఆర్బీఐ గవర్నర్ పదవికి రేసులో మిగిలింది.. ఆ నలుగురు..

Posted: 06/27/2016 05:22 PM IST
India cuts rbi governor shortlist to four officials say

ఆర్‌బీఐ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై దేశవ్యాప్తంగా మేధావులు, అర్థిక నిఫుణులలతో పాటు అటు మార్కెట్ తో సంబంధమున్న అనేక వ్యక్తుల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. అటు ప్రభుత్వం కూడా అభ్యర్థుల జాబితాను కుదించడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. దీంతో రఘురామ్ రాజన్ వారసులు ఎవరు..? అర్బీఐ గవర్నర్ పదవి పగ్గాలను అందుకునే వారెవరు..? ఈ రేసులో షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో నిలిచిందెవరు..? కోత్త మానిటరీ పాలసీ కమిటీ ఎంపిక ఎప్పడు జరుగుతుందన్న ప్రశ్నలపై చర్చలు జోరందుకున్నాయి.

మరో మూడు మాసాల్లో రఘురామ్ రాజన్ పదవీ కాలం ముగిస్తుండటంతో భారత ఆర్థిక పరిస్థితిని ప్రగతి బాటన నిలిపేదవరన్న ఉత్కంఠ సర్వత్రా నెలకోంది. అటు ప్రభుత్వం కూడా ఈ ఎంపికలో తన అభ్యర్థుల జాబితాను కుదించినట్టు  సీనియర్  అధికారి రాయిటర్స్ కి చెప్పారు.  కొత్త ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ)కూడా త్వరలో గవర్నర్ ను ఎంపిక చేస్తుందని తెలిపారు. ప్రధానంగా నలుగురు అభ్యర్థుతో కూడిన  జాబితాను  ఎంపిక చేశామన్నారు. వీరిలో ముగ్గురు కేంద్ర బ్యాంకు మాజీ, ప్రస్తుత  ఉన్నతోద్యోగులు  కాగా,  మరొకరు స్టేట్ బ్యాంక్   చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య.

ప్రస్తుత ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్  ఉర్జిత్ పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ గవర్నర్ రేసులో ఉన్నారు.ఒకవైపు  ఎస్ బీఐ  అధిపతి అరుంధతి భట్టాచార్య  ఈ పదవికి ఎంపిక కావడం ఖాయమనే ఊహాగానాలు  జోరుగా సాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం షార్ట్ లిస్ట్  చేసిన జాబితాలో కూడా ఈమె పేరు ప్రముఖంగా ఉండడంతో ఇవి మరింత  ఊపందుకున్నాయి. మరోవైపు దేశ ఉన్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  అధిపతిగా అరుంధతి ఎంపిక పై వస్తున్న ఊహాగానాలపై నెటిజన్లు దాదాపు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

ఆమెకు అంత అర్హత లేదనీ, ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితులలో  ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే దక్షత,  నైపుణ్యంలేవని  వాదిస్తున్నారు. ఒకవేళ  ఆర్ బీఐ అత్యున్నత పదివికి  అరుంధతి భట్టాచార్య ఎంపికైతే .. అరవింద సుబ్రమణియన్, శక్తికాంత్  దాస్లపై విమర్శలు గుప్పించి.. వారిని రేసునుంచి తప్పించిడంలో సఫలీకృతుడైన బీజేపీ ఎంపీ, సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎలా స్పందిస్తారు? ఈ నేపథ్యంలో గవర్నర్ రేసు పై  అంతకంతకూ సస్పెన్స్ పెరుగుతోంది. మరి దీనికి తెరపడాలంటే తుది నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles