Sensex Posts Biggest Loss In 3 Weeks On Selling In IT Stocks

Sensex back in red tumbles 257 points ahead of iip data

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Sensex and Nifty posted their biggest loss in three weeks on Thursday, retreating from a seven-month high hit a day earlier, as caution set in ahead of the U.S. Federal Reserve meeting,

విదేశాల ప్రతికూల పవనాలు.. నష్టాల్లో మార్కెట్లు

Posted: 06/09/2016 05:48 PM IST
Sensex back in red tumbles 257 points ahead of iip data

దేశీయ స్టాక్ మార్కెట్లను ఇవాళ నష్టాలు ముంచెత్తాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలు, అమెరికా కేంద్రీయ బ్యాంకు ఫెడరల్ రిజర్వు ద్రవ్య పరపతి విధాన సమీక్షకు పూనుకోవడంతో పాటు ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల నేపథ్యంలో దేశీయ సూచీలను నష్టాలు ముంచెత్తాయి, నిన్నటి లాభాలతో ఏకంగా ఏడు మాసాల గరిష్ట స్థాయిని తాకిన మార్కెట్లు ఇవాళ మూడు వారాలలో అత్యంత అధిక నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అదే దిశలో పయనిస్తూ చివరకు నష్టాలతోనే ముగిశాయి.   

ఇవాళ ఉదయం ప్రారంభంతోనే దేశీయ సూచీలు నష్టాల బాటలో పయనించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే 91 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో సెన్సెక్స్ ఆరంభంలోనే 27,000 పాయింట్లకు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా 36 పాయింట్లను ఉదయాన్నే కోల్పోయింది. దీంతో 27 వేల మార్కును సెన్సక్స్ కోల్పగా, నిఫ్టీ మాత్రం 8200 మార్కును నిలబెట్టుకుంది, 257 పాయింట్లు నష్టపోయి 26 వేల 763 పాయింట్ల వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 69 పాయింట్లు నష్టపోయి 8 వేల 204 వద్ద ముగిసింది.

ఇవాళ్లి ట్రేడింగ్ లో మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, చిన్న తరహా పరిశ్రమల సమాఖ్యలకు చెందిన షేర్లు లాభాలను అర్జించగా, మిగిలిన అన్ని సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంజీసీ, అటో, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ షేర్లు అధిక నష్టాలను మూటగట్టుకోగా, మిగిలిన అన్ని సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో  కోల్ ఇండియా తో పాటు రిలయన్స్,బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీలు తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, ఇన్ఫోసిస్, అంబుజా సిమింట్స్, హిందుస్థాన్ యూనీ లివర్ , హీరో మోటో కార్ప్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles