Nissan bets on Datsun again to crack India's small car market

Datsun entered mini segment with redi go

Datsun,Datsun Redi-GO,Datsun redi-Go comparison,redi go vs kwid,redi go vs eon,redi go vs Alto 800,redi-Go vs Kwid vs Alto 800 Vs Eon,redi go vs kwid vs alto 800,Datsun Redi-Go specifications,redi-go,datsun redi go mileage,Datsun redi-Go Vs Renault kwid,d

Japanese auto major Nissan today launched its new small car redi-GO from Datsun’s stable priced between Rs 2.38 lakh and Rs 3.34 lakh (ex-showroom Delhi).

నిస్సాన్ డాట్సన్ నుంచి మధ్యతరగతి కారు.. మార్కట్లోకి రెడి గో..

Posted: 06/08/2016 06:37 PM IST
Datsun entered mini segment with redi go

జపాన్‌కు చెందిన నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్‌లో కొత్త చిన్న కారు మోడల్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. డాట్సన్ రెడి-గో పేరుతో అందిస్తున్న ఈ పెట్రోల్ కారు ధరలు 2.38 లక్షల నుంచి రూ.3.34 లక్షల రేంజ్‌లో నిర్ణయించామని నిస్సాన్ ఇండియా కంపెనీ తెలిపింది. డాట్సన్ రెడి గో కారును ఐదు వేరియంట్లు-డి, ఏ, టీ, టి(ఓ), ఎస్‌ల్లో అందిస్తున్నామని నిస్సాన్ ఇండియా ఎండీ, అరుణ్ మల్హోత్ర చెప్పారు. చిన్న కారు అంటే భారత్‌లో ఉన్న అంచనాలను ఈ డాట్సన్ గో మార్చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం నుంచే విక్రయాలు ప్రారంభించామని తెలిపారు.

రెడీ గో రాకతో ఎంట్రీ-లెవల్ సెగ్మంట్‌లో ధరల యుద్ధానికి తెర లేవనున్నదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ కారు మారుతీ ఆల్టో,  హ్యుందాయ్ ఈఆన్, రెనో క్విడ్ కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులంటున్నారు. ఈ కార్ల ధరలు రూ.2.5 లక్షల నుంచి రూ4.42 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.  మూడో డాట్సన్ కారు: డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ అందిస్తోన్న మూడో కారు ఇది. భారత్‌లో అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫాం మీద ఈ కారును నిస్సాన్‌కంపెనీ తయారు చేస్తోంది. 800 సీసీ ఇంజిన్, ఐదు గేర్లు ఉన్న ఈ కారు 25.17 కి.మీ. మైలేజీని ఇస్తుందని,  వంద కిమీ, వేగాన్ని 15.9 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని అరుణ్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nissan Company  small car  datsun redi-Go  

Other Articles