PF withdrawal to go online! Settlement will be within 3 hours

Epfo eyes online pf withdrawal facility by march end

PF withdrawal,Employees' Provident Fund Organisation (EPFO),Online PF withdrawal,Provident fund,Aadhar card,Supreme court on Aadhaar,Supremen court ruling on Aadhaar,Labour ministry,Central Provident Fund Commissioner K K Jalan,Unique Account Numbers (UAN),PF UAN

The EPFO has to link at least 40% of UANs with Aadhaar numbers and bank accounts of subscribers to make the facility operational

మార్చి నెలాఖరు నాటికి.. ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ విత్ డ్రా సౌలభ్యం

Posted: 10/17/2015 04:50 PM IST
Epfo eyes online pf withdrawal facility by march end

ప్రావిడెంట్ ఫండ్  పీఎఫ్ ఉపసంహరణలకు కోసం ఒక పిఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీరు పనిచేస్తున్న సంస్థ నుంచి  అదో, ఇదో, ఏదో ఒక కాగితం కావాలన్న అధికారుల వేధింపులు ఇక వుండవు. చెప్పులే కాదు కాళ్లు అరుగుతున్నాయన్న డైలాగులు కూడా వినిపించని రోజులు త్వరలోనే రానున్నాయి. నమ్మశక్యంగా లేదా..? నిజమండీ.. ఇక కాగితంతో అసలు పనిలేకుండానే మీ ఫీఎఫ్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే రోజులు వచ్చేస్తున్నాయి. అది కూడా కేవలం మూడు గంటల వ్యవధిలోనే.

ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ విత్‌డ్రాయల్ సౌలభ్యం అందించే ప్రయత్నంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ఉంది. మార్చి నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలాన్ వెల్లడించారు. ప్రావిడెంట్ ఫండ్‌ సహా ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డ్‌ను స్వచ్ఛందంగా అమలుచేయడానికి గడువును సుప్రీంకోర్టు మార్చి వరకూ పొడిగించిన నేపథ్యంలో... ఈపీఎఫ్‌ఓ తాజా ప్రకటన వెలువడింది. ఆధార్ అనుసంధానంగా... దరఖాస్తు అందిన మూడు గంటల్లోనే పీఎఫ్ క్లెయిమ్ పరిష్కారమయ్యేలా అమల్లోకి రానున్న తాజా చర్య దోహదపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈపీఎఫ్‌ఓకు ప్రస్తుతం చందాదారులుగా వున్న 5 కోట్ల మందికి
ఉపశమనం కలగనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhaar Card  Supreme Court  Central Provident Fund  kk jalan  

Other Articles