Sensex rises 230 pts, Nifty ends above 8150; Tata Motors up 8%

Sensex snaps 3 day losing streak ends 230 pts up nifty at 8 179

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Snapping the three days long losing streak, the domestic markets ended the day stronger as consumer stocks gained on hopes lower inflation and a larger-than-expected rate cut by the central bank in September would boost spending in the coming festive season.

మూడు రోజుల వరుస లాభాలకు బ్రేకులు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Posted: 10/15/2015 04:52 PM IST
Sensex snaps 3 day losing streak ends 230 pts up nifty at 8 179

గత మూడు రోజులుగా వరుసగా వచ్చిన నష్టాలకు ఇవాళ కళ్లెలు పడ్డాయి. సానుకూల పవనాలతో ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. కేంద్రం వెలువరించనున్న నిత్యావసరాల సరుకుల ధరాఘాత సూచికలో ధరాఘాతం ప్రభావం అంతగా వుండదన్న సంకేతాల నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీనికి తోడు భారతీయ రిజర్వు భ్యాంకు ఇటీవల రెపో రేటును 50 డిసెమిల్స్ మేర తగ్గించిన నేపథ్యంలో ఈ సారి పండుగల సీజన్ లో ప్రజలు తమ వద్దనున్న డబ్బును కాస్తా రెట్టించిన స్థాయిలోనే ఖర్చుచేస్తారన్న అంచానాలు కూడా మదుపరుల కొనుగోళ్లకు కారణమయ్యాయి.

ధరాఘాతం తగ్గుముఖం పట్టడం.. ఏడవ వేతన సవరణ, రిజర్వు బ్యాంకు నిర్ణయాలతో మార్కెట్లు ఇవాళ లాభాల్లో దూసుకెళ్లాయి. గత కొన్ని రోజులుగా 27 మార్కు వద్ద ఊగిసలాడుతున్న సెన్సెక్.. ఇవాళ లాభాలతో మరోసారి ఆ మార్కును దాింది. కాగా. నిఫ్టీ 8200 మార్కుకు అత్యంత చేరువగా నిలిచింది. ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే లాభాలను ఆర్జించాయి. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 230 పాయింట్లు లాభాన్ని ఆర్జించి 27 మార్కును తాకింది. సెన్సెక్స్ 27, 010 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, అటు నిఫ్టీ కూడా 72 పాయింట్లు లాభంతో 8,180 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

ఈ క్రమంలో ఐటీ మినహా అన్ని సూచీలు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఆటో, బ్యాకిందగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. మెటెల్స్, ఎఫ్ ఎం జీ సీ,  పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, మద్య తరహా పరిశ్రమల సూచీలు కూడా ఓ మోస్తారు లాభాలను గడించాయి. కాగా మిగిలిన అన్ని సూచీలు స్వల్ప లాభాలను అర్జించాయి. ఈ నేపథ్యంలో జీ ఎంటర్ టైన్ మెంట్, టాటా మోటార్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బిపిసీఎల్, బిహెచ్ఇఎల్ తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, సిప్లా, మహింద్రా అండ్ మహింద్రా, విప్రో, హిండాల్కో, హిందుస్థాన్ యూనీ లీవర్ లిమిటెడ్ తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles