స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 6 ఎస్ (ఐఫోన్ 7) ప్రపంచ విఫణిలోకి ప్రవేశించనుంది. ఇందుకోసం ప్రముఖ దిగ్గజ సంస్థ యాపిల్ అన్ని ఏర్పాట్లను సిద్దం చేసింది. గత ఆనవాయితీలనే మునుముందు కూడా కొనసాగిస్తామన్న సంకేతంలో.. ఎప్పటిలానే సెప్టెంబర్ 9నే యాపిల్ కంపెనీ తన కొత్త ఉత్పత్తిని మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు ‘యాపిల్’ పంపిన ఆహ్వాన లేఖలు చేరిపోయాయి.
‘‘హే సిరి, గివ్ అజ్ ఏ హింట్’’ పేరిట పంపిన ఇన్విటేషన్ లో శాన్ ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహం సివిక్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని యాపిల్ పేర్కొంది. యాపిల్ కంపెనీ ఇప్పటిదాకా విడుదల చేసిన ఉత్పత్తులన్నీ సెప్టెంబర్ 9నే మార్కెట్ లోకి రంగప్రవేశం చేశాయి. అయితే మార్కెట్ విశ్లేషకులు మాత్రం యాఫిల్ తన కొత్త ఐఫోన్ తో పాటుగా ఐప్యాడ్ లను యాపిల్ టీవీలను కూడా సంస్థ అవిష్కరిస్తుందని భావిస్తున్నారు
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more