Sensex down 318 points; Nifty ends below 7800, F&O expiry eyed

Sensex nifty edge lower in volatile trade

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Housing finance company HDFC topped the selling list on Sensex, down 3.8 percent followed by Infosys, ICICI Bank, Larsen & Toubro, State Bank of India, Sun Pharma, ITC, M&M, ONGC, Hero Motocorp and Bharti Airtel with 1-3.5 percent losses.

చైనా అర్థిక సంక్షోభంపై వీడని భయం.. ధేశీయ మార్కెట్ల బ్లడ్ బాత్

Posted: 08/26/2015 06:45 PM IST
Sensex nifty edge lower in volatile trade

అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి మరింత క్షీణించడంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు మళ్లీ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ మరింత పతనమై రూపాయలు 66. 14 పైసలుగా నమోదు కావడం దేశీయ  సూచీలను భారీగా దెబ్బతీసింది.. దీనికి తోడు అటు ఛైనా తమ కరెన్సీ యవ్వాన్ విలువను ఇప్పటికే తగ్గించినా.. దాంతో కూడా ఆర్థిక సంక్షోభం నుంచి భయటపడుతుందన్న నమ్మకాలు సన్నగిల్లడంతో అంచాలను తారుమారు అవుతున్న నేపత్యంలో మదుపరులు కొనుగోళ్ల పట్ల ఆసక్తిని ప్రదర్శించకపోవడం.. పైగా అమ్మకాలకు ఒత్తిడి చేయడంతో.. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.

ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే దేశీయ సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఆర్జించిన లాభాలన్ని తుడిచిపెట్టుకుపోయాయి. మరోమారు చైనా తన వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న వార్తల నేపథ్యంలో చైనా మారెట్లు ఢమాల్ మన్నాయి. దాని ప్రభావం ఇటు దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా పడటంతో సూచీలు కుదుపులకు లోనయ్యాయి. ఉదయం ప్రారంభంతోనే 300 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్.. మధ్యాహ్నానికి 400 పెచిలుకు పాయింట్లను కోల్పోయింది. అటు నిఫ్టీ కూడా ఉదయం ప్రారంభంతోనే 7850 మార్కు వద్దకు చేరుకోగా, మధ్యాహ్నానికి కొద్దిగా తేరుకుని 7900 పాయింట్లకు పైగా ట్రేడింగ్ సాగించింది. విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలు దేశీయ సూచీలను దెబ్బతీశాయి. దీంతో మార్కెట్ మార్కెట్ ముగిసే సమయానికి  సెన్సెక్స్ 318 పాయింట్ల నష్టంతో 25,714 దగ్గర,  నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 7792 వద్ద ముగిసింది..

 మెటల్స్, చిన్న తరహా పరిశ్రమల సూచీలు స్వల్ప లాభాలను ఆర్జించగా, అటో, బ్యాంకింగ్, బ్యాకింగ్ నిఫ్టీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ సూచీలు భారీ నష్టాలను ఎదర్కోగా, కన్జూమర్ డ్యూరబుల్స్, ఎప్ఎంజీసీ, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెన్నాలజీ, మధ్య తరహా పరిశ్రమల సూచీలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో బిహెచ్ఇఎల్, కాయిర్న్ ఇండియా, టాటా పవర్, బజాజ్ అటో, టాటా మోటార్స్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను గడించగా, అంజుబా సిమెంట్స్, టెక్ మహీంద్రా, హెచ్ ఢి ఎఫ్ సి, ఎస్ బి ఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles