Gold Prices Shine on Weak Rupee, Seasonal Demand, Delayed Fed Rate Hike

Gold set for biggest weekly rise since january as stocks dollar slide

Gold Prices,bullion market,rupee,rupee depreciation,US central bank interest rate hike,US Federal Reserve rate hike,monetary tightening,Federal Open Market Committee (FOMC),July FOMC minutes,Barclays,US Dollar,US dollar gold,gold safe haven,global economy

Gold prices rebounded to a two-month high on Friday, as a slew of positive factors such as weakening rupee, demand from jewellers and uncertainty over interest rate hike in the US in September, supported the yellow metal prices.

మరింత పైకి ఎగబాకనున్న బంగారం, వెండి ధరలు

Posted: 08/22/2015 05:59 PM IST
Gold set for biggest weekly rise since january as stocks dollar slide

చైనా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువ పతనం అవుతున్న క్రమంలో ఇక బంగారం వెండి ధరలు పైపైకి ఎగబాకడం ఖాయంగా కనబడుతోంది. ఒక్క రోజులోనే వెయ్యి రూపాయల పైచిలుకు ఎగబాకిన బంగారం ధర.. రానున్న రోజుల్లో సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ నష్టాలలో కూరుకుపోతున్న క్రమంలో ఇక బంగారం, వెండీలపైనే తమ పెట్టుబడులు పెట్టాలని మదుపరులు నిశ్చయించుకోవడంతో పసిడి ధరలకు అమాంతం రెక్కలు రావడం ఖాయంగా తెలుస్తోంది. ఇందుకు గత వారం రోజులుగా ముంబై బులియన్ మార్కెట్‌లో నమోదవుతున్న ధరలు కూడా ఊతమిస్తున్నాయి.

క్రితం రోజున 24 క్యారెట్లు 10 గ్రాముల ధర అంతకు ముందురోజు ధరతో పోల్చితే రూ.495 పెరిగి రూ.26,995కు చేరింది. 22 క్యారెట్ల ధర కూడా అంతే స్థాయిలో ఎగసి రూ.26,845కు ఎగసింది. జూన్ 19 తరువాత రేట్లు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. ఇక కేజీ వెండి విషయానికి వస్తే- రూ.240 పెరిగి రూ.37,035కు చేరింది. ఈ రేటు కూడా రెండు నెలల గరిష్ట స్థాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదల ధోరణి, దేశంలో స్టాకిస్టుల డిమాండ్ పెరగడం వంటి కారణాలు పసిడి పరుగుకు కారణం. తాజా సమాచారం అందే సరికి నెమైక్స్ కమోడిటీ మార్కెట్‌లో పసిడి ధర  (ఔన్స్ 31గ్రా)లాభాల్లో 1,160 డాలర్ల వద్ద  ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి ధర శుక్రవారం కూడా భారీ లాభాలతో కడపటి సమాచారం అందే సరికి రూ.27,290 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా రూ.100కుపైగా లాభంతో రూ.36,201 వద్ద ట్రేడవుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : interest rates  Gold  Federal Reserve  China  | bullion market  

Other Articles