Gold at four-month low on weak global cues, sluggish demand

Gold falls by rs 250 to hit 4 month low

Gold, Gold prices, Gold falls, Gold jewellery, Gold demand, Gold consumption, Silver prices, Gold, bullion market, jewellers, domestic spot market

Gold prices tumbled by Rs 250 to trade at a four-month low of Rs 26,000 per 10 grams at the bullion market on Saturday, tracking a weak global trend amid subdued demand from jewellers at the domestic spot market.

నాలుగేళ్ల కనిష్టస్థాయికి చేరిన బంగారం వెండి ధరలు

Posted: 07/19/2015 02:51 PM IST
Gold falls by rs 250 to hit 4 month low

దేశీ మార్కెట్‌లో పుత్తడి ధర నాలుగు మాసాల కనిష్ట స్థాయికి చేరింది. అదే బాటలో సామాన్యుల అభరణ లోహం వెండి కూడా పయనిచింది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర రూ.250 తగ్గి రూ.25,850 దగ్గర ముగిసింది. కిలో వెండి ధర సైతం రూ.250 నష్టంతో రూ.34,350 దగ్గర క్లోజైంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. మన దేశ మార్కెట్‌ ధరను ప్రభావితం చేసే న్యూయార్క్‌ మార్కెట్‌లో శనివారం ఔన్స్‌ (31.10 గ్రాములు) పుత్తడి ధర 1,129.60 డాలర్లకు (సుమా రు రూ.72,320) చేరింది. 2010 ఏప్రిల్‌ తర్వాత బంగారానికి ఇదే కనిష్ఠ ధర. ఔన్స్‌ వెండి ధర సైతం 15 డాలర్ల దిగువకు వచ్చింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందన్న వార్తలు, గ్రీస్‌, చైనా ఆర్థిక సమస్యలు గాడిలో పడడం, ఇరాన్‌పై ‘అణు’మానాలు తీరిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు మళ్లీ గాడిలో పడ్డాయి. దీంతో సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న ప్రాముఖ్యత తగ్గింది. అయినా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి కొనుగోళ్లు ఏ మాత్రం పుంజుకోవడం లేదు. జూలైలో మంచి ముహూర్తాలు లేకపోవడంతో దేశం లో పెళ్లిళ్లు సైతం తగ్గాయి. మన దేశంలో అమ్ముడయ్యే బంగారం, వెండి లేదా వాటితో చేసిన ఆభరణాలకు దాదాపు 60 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే డిమాండ్‌ ఉంటుంది. నైరుతి రుతుపవనాలు మసకేయడంతో ఈ సంవత్సరం ఈ డిమాండ్‌ బాగా తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold  bullion market  jewellers  domestic spot market  

Other Articles