Sensex falls 297 pts, Nifty at 3-month low, Infosys trips 6%

Sensex falls 297 pts nifty at 3 month low

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in April, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys

Bears took the complete control on Dalal Street on Friday with the equity benchmarks falling more than 3-month low, largely due to selling pressure in Infosys post disappointing Q4 earnings.

వారంతంలో స్టాక్ మార్కెట్లకు నష్టాలు. 3 నెలల కనిష్టస్థాయికి నిఫ్టీ

Posted: 04/24/2015 09:05 PM IST
Sensex falls 297 pts nifty at 3 month low

విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు తోడు ఇన్పోసిస్ నాల్గవ త్రైమాసికంలో మూటగట్టుకున్న నష్టాలతో వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఈ వారం అద్యంతం ఒక్క రోజు మినహాయించి అన్ని రోజులు సూచీలు నష్టాలలోనే ట్రేడింగ్ ను కోనసాగించాయి. ఈ వారంలో చవిచూసిన నష్టాలతో నిష్టీ మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకోగా, సెన్సెక్స్ ఇవాళ 297 పాయింట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఇవాళ ఉదయం మార్కెట్లు ప్రారంభం నుంచే దేశీయ సూచీలు నష్టాల బాటలో పయనించాయి. మధ్య తరహా పరిశ్రమల షేర్లకు తోడు చిన్న తరహా పరిశ్రమల సూచీలు కూడా క్రమంగా నష్టాలను చవిచూడటంతో భారీ నష్టాలను మార్కట్లు మూటగట్టుకున్నాయి

ఇవాళ నాల్గవ త్రైమాసికం ఫలితాలను వెల్లడించిన ఇన్ఫోసిస్ ఆంచనాలకు తలకిందలు చేస్తూ.. ఆశించిన స్థాయిలో లాభాలను ఆర్జించకపోవడంతో మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి కూడా అధికం కావడంతో మార్కెట్లు నష్టాల బాటలో పయనించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎఫ్ ఎం జీ సి, మినహా అన్ని సూచీలు నష్టాలలోనే కోనసాగాయి. మెటల్, మధ్య తరహా పరిశ్రమల సెక్టార్లు లాభాలలో పయనించగా, చిన్న తరహా, పబ్లిక్ సెక్టార్, ఐటీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, అటో రంగాల సెక్టార్లు నష్టాలో పయనించడంతో స్టాక్ మార్కెట్టు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 297 పాయింట్ల నష్టంతో. 27 వేల 438 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 93 పాయింట్ల నష్టంతో 8305 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ, కాయిర్న్ ఇండియా, లుపిన్, ఐటీసీ సంస్థల షేర్లు లాభాలను ఆర్జించాయి. కాగా ఇన్పోసిస్, టెక్ మహీంద్రా, సిప్లా, ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్ సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  

Other Articles