SBI cuts home loan rate by .25 percent, Huge relief for New Borrowers

Sbi cuts home loan interest rate by up to 0 25 percent

SBI cuts home loan rate by .25 percent, Huge relief for New Borrowers, State Bank of India (SBI ), relief for New housing loan Borrowers, SBI cuts interest rate on home loans by 0.25 percent, small and medium loan takers, SBI interest rate will be 9.90 per cent,

State Bank of India (SBI ) cuts interest rate on home loans by 0.25 percent, in earlier days their were complaints to SBI that if private bank (HDFC) is charging lower interest rates then you then what is the use of govt bank.

ఎస్బీఐ గృహరుణదారులకు శుభవార్త.. వడ్డీ రేట్లను తగ్గింపు

Posted: 04/12/2015 08:21 PM IST
Sbi cuts home loan interest rate by up to 0 25 percent

భారతీయ స్టేట్ బ్యాంకు తమ బ్యాంకులో గృహరుణాలు తీసుకున్న వారికి శుభవార్తను అందించింది. ప్రైవేటు బ్యాంకు హెచ్ డీ ఎఫ్ సీ తన బ్యాంకు నుంచి గృహ రుణాలను తీసుకున్న ఖాతాదారులకు వడ్డీ రేటును తగ్గించి తీపికబురు అందించడంతో ఎస్బీఐ కూడా తమ గృహ రుణదారులకు శుభవార్తను అందించింది. హెచ్ డీ ఎఫ్ సీ తరహాలోనే ఎస్ బీ ఐ కూడా గృహరుణాలపై వడ్డీరేటును 0.25 శాతం తగ్గించింది. దీంతో వడ్డీరేటు 10.15 శాతం నుంచి 9.9 శాతానికి తగ్గించింది. గత నెల భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధానం సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించడంతో బ్యాంకులు ఈ మేరకు నిర్ణయాలను తీసుకున్నాయి.

తగ్గించిన వడ్డీ రేట్లు ఈ నెల 13 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్ బీఐ తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునేవారికి కూడా ఇదే తగ్గించిన వడ్డీరేటు వర్తిస్తుంది. తాజా తగ్గింపుతో గృహరుణ గ్రహీతలకు ఇఎంఐ భారం కాస్త తగ్గుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లు తగ్గించిన రెండు రోజులకు ఎస్ బీఐ కూడా ఇదే బాట పట్టింది. రుణాలపై వడ్డీరేటును హెచ్‌డీఎఫ్‌సీ 0.2 శాతం తగ్గించింది. దీంతో వడ్డీరేటు 9.9 శాతానికి దిగొచ్చింది. కొత్త, పాత రుణగ్రహీతలకు ఇది వర్తిస్తుందని వివరించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI  home loan interest  0.25 percent rate cut  

Other Articles