Pretty Huawei P8 Lite reveals itself in live shots

Huawei flagship p8 and p8 lite images leaked

Huawei flagship P8 and P8 Lite images leaked, Pretty Huawei P8 Lite reveals itself in live shots, P8 and P8 Lite, technology, Mobiles and tabs, Huawei, Huawei P8, Huawei P8 Lite, Leaked, Huawei flagship smartphones,

Not long ago, Huawei teased its audience with a promo video of its flagship smartphones, the P8 and P8 Lite.

ప్రపంచ విపణీలోకి త్వరలో. హువాయ్ పి8, పి8 లైట్ స్మార్ట్ ఫోన్లు

Posted: 04/11/2015 08:12 PM IST
Huawei flagship p8 and p8 lite images leaked

ప్రపంచ విఫణీలోకి త్వరలో అవిష్కృతం కానున్న హువాయ్ పీ-8, పీ-8 లైట్ ఫోన్ల డిజైన్లను విడుదలకు ముందే లీక్ అయ్యాయి. చైనా యాపిల్ ఫోన్లుగా ఖ్యాతీ చెందిన హవాయ్ పోన్లులో అత్యాధునిక ఫీచర్లతో పాటు డిస్ ప్లే కూడా వుందని తెలుస్తోంది. వీడియో టీజర్ ద్వారా ఇన్నాళ్లు ఊరించిన పి8 ఫోన్లపై అందిన సమాచారం మేరకు దానికి వెన్నుముక్కగా నిలిచేది బ్యాటరీయే..ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారుగా ఇది ఆరు రోజుల వరకు పస్తుందని వార్తలు వెలువడుతున్నాయి.

హవాయ్ ఫోన్లపై కథనాలు, స్మార్ట్ పోన్ వినియోగదారులను ఆకర్షించడంతో పాటు తీవ్ర ఉత్కంఠకు కూడా గురిచేశాయి. కాగా అందిన సమాచారం మేరకు పి8 స్మార్ట్ పోన్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీస్ ప్లే తో పాటు 3 జీబి రామ్ కలిగింవుంటుంది. హవాయ్ కంపెనీ సోంతంగా రూపోందించిన కిరిన్ 935 చిప్ సెట్ ను ఇందులో వినియోగిస్తున్నారు. 32 జీబి ఇంటర్నల్ మెమరీతో 2520 ఎంఎహెచ్ బ్యాటరీ దీనికి అకర్షణ, అండ్రాయిడ్ 5.0 లాలీపాప్ అపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తున్న స్మార్ట్ ఫోన్ కు ముందు 5 మెగా పిక్సల్ కెమెరా పోందుపర్చగా, వెనుక 13 మెగా పిక్సల్ కెమెరా పోందుపర్చారు.

ఇక హవాయ్ పి-8 లైట్ స్మార్ట్ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే పి-8 కన్నా లైటర్ ఫీచ్చర్స్ తో వున్నాయి. ఐదు అంగుళాల హై డెఫినిషన్ తో డిస్ ప్లేతో రూపోందించబడింది. ఇందులో 2 జీబీ రామ్ పోందుపర్చబడగా, చూడటానికి మాత్రం పీ-8 మాదిరిగానే కనబడుతుంది. ఇక మిగిలిన ఫీచర్స్ అన్ని రమారమి పి-8 స్మార్ట్ పోన్ లో పోందుపర్చినవేనని సమాచారం. ఈ ఫోన్లు ఈ నెల 15న అవిష్కృతం కానున్నాయి. దీంతో త్వరలోనే ప్రపంచ విఫణీలోకి అడుగుపెట్టనున్నాయి.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : technology  Mobiles and tabs  Huawei  Huawei P8  Huawei P8 Lite  Leaked  

Other Articles