Gold and silver prices slashed once again

yellow metal, silver, Previous metal, Gold, bullion gold price, silver price, gold prices slashed, silver prices slashed, bullion market, bullion market weak global trend, no demand for gold, mo demand for silver, price of silver, price of gold, todays gold price, todays silver price

Gold prices drifted by Rs 100 to Rs 28,400 per ten grams at the bullion market today as demand from jewellers and retailers eased at existing levels amidst a weak global trend.

ధర తగ్గినా.. వన్నె తగ్గని బంగారం ధర, అదేబాటలో వెండి..

Posted: 01/24/2015 08:34 PM IST
Gold and silver prices slashed once again

పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న కొద్ది పైపైకి ఎగబాకే బంగారం ధరలు ఈ సారి పెళ్లిళ్ల మాసం వచ్చినా ధరలు పసిడి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. శనివారం నాటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 100 మేర తగ్గి రూ. 28,400కు చేరుకుంది. నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి పసిడికి డిమాండ్ తగ్గడం వారాంతంలో ధరలు తగ్గాయి. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం బలహీన ట్రెండ్లు కొనసాగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

వెండి ధరలు కూడా కిలోకు రూ. 65 మేర తగ్గి, రూ. 40,035కు చేరుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండు తగ్గడంతో వెండి ధర తగ్గిందని చెబుతున్నారు. బంగారం వెండి ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా స్వర్ణం విక్రయాలపై కొనుగోళ్ల ప్రభావం లేకపోవమేనని వ్యాపారులు చెబుతున్నారు. ఢిల్లీలో 99.9, 99.5 శాతం స్వచ్ఛ బంగారం ధరలు పది గ్రాములకు రూ. 28,400, రూ. 28,200 చొప్పున ఉన్నాయి. వెండి ధరలు కేజీ  కి 39 వేల 875 రూపాయలుగా నమోదయ్యాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold price  silver price  gold price slashed  

Other Articles