Sensex nifty hit fresh peaks as banks rally on kotak ing deal

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE

Sensex, Nifty hit fresh peaks as banks rally on Kotak-ING deal

వారంతంలో కొత్త రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్లు

Posted: 11/21/2014 06:10 PM IST
Sensex nifty hit fresh peaks as banks rally on kotak ing deal

దేశీయ సూచీలలో బాంకింగ్ రంగ షేర్లు ర్యాలీని కోనసాగించడంతో స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిశాయి. మూడు వారాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బెంచ్ మార్క్ ను చేరుకున్నాయి. దీనికి తోడు విదేశీ ష్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలు సూచీలను కోత్త రికార్టును నమోదు చేసేలా చేశాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 267 పాయింట్లు లాభపడి 28,334 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 75 పాయింట్లు ఎగసి 8,477 వద్ద ఆగింది. బ్యాంకు షేర్లు ర్యాలీతో మార్కెట్ ముందుకు దూసుకుపోయింది. కొటక్ మహీంద్ర బ్యాంకులో ఐఎన్జీ వైశ్య బ్యాంకు విలీనం అంశం బ్యాంకు షేర్లకు ఊతమిచ్చింది. ట్రేడింగ్ ఆరంభం నుంచి లాభాల్లో పయనించిన మార్కెట్ చివరివరకు అదే ఊపు కొనసాగించి కొత్త రికార్డులను నమోదు చేసుకున్నాయి.

 బ్యాంకు షేర్లతో పాటు కన్జుమర్ డ్యురబుల్, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, ఫాస్ట్ మూవింగ్ కన్యూమర్ గూడ్స్, మెటల్, ఆటో, ఆయిల్, గ్యాస్ షేర్లు కూడా లాభాలు నమోదు చేసుకోవడంతో సూచీలు కొత్త రికార్డులను అధిరోహించేందుకు దోహదపడ్డాయి. ఇన్పోసిస్, టాటా పవర్ కార్పోరేషన్, సన్ ఫార్మసూటికల్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనీ లీవర్, టాటా స్టీల్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా  భిహెచ్ఈఎల్, ఎస్ బి ఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హిండాల్కో, అక్సిస్ బ్యాంక్ తమ జోరును కోనసాగించడంతో ఆయా సంస్థల షేర్లు లాభాలను ఆర్జించాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  Sensex  Stocks  Sensex today  BSE  NSE  

Other Articles