Is google glass a flop developers and customers are ditching the smart spectacles in favour of oculus rift

Google Glass, flop, Developers, customers, smart spectacles, Oculus Rift, ditching device, Sergey Brin, abandoned, general public, fashionable frames, Glassholes, privacy fea

Is Google Glass a flop? Developers - and customers - are ditching the smart spectacles in favour of Oculus Rift

ప్రపంచ విఫణీలోకి గూగుల్ గ్లాసెస్ రానట్టే..?

Posted: 11/18/2014 09:31 PM IST
Is google glass a flop developers and customers are ditching the smart spectacles in favour of oculus rift

ధ్వని ఆధారంగా పని చేస్తూ కమ్యూనికేషన్‌ రంగంలో మరో సంచలనాత్మక ఆవిష్కరణగా నిలిచిన గూగుల్‌ గ్లాసెస్‌ కు అప్పుడే బీటాలు వారాయి. ప్రపంచం మొత్తం మన కంటి ముందు ఉంచగల ఈ చిన్న పరికరం, మనిషి భద్రతకు అండగా నిలబడతూనే, అడ్డంకిగా కూడా మారుతోంది. చిన్నపాటి గుండ్రని పరికరాన్ని వాడేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని తేలడంతో.. గూగుల్ యాజమాన్యం వాటి విడుదలలో మల్లగుల్లాలు పడుతోందని స్పష్టమవుతోంది. ఇప్పటికీ ఈ గ్లాసెస్ విడుదలపై యాజమాన్యం తర్జనభర్జనలు పడుతోంది. కంటి రెపల సాయంతో ఫోటోలు తీయడం, రికార్డింగ్ చేయడంతో పాటు తమ కళ్లముందు సమస్త సమాచారాన్ని అవిష్రించగల గూగుల్ గ్లాసెస్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది.

షాంకేతిక రంగ నిపుణులకు చల్లగా వున్నప్పటికీ వీటిని సాధరణ ప్రజానికానికి అందజేయడం మాత్రం కష్టతరంగా మారుతోంది. ఈ అద్భుత అవిష్కరణకు ఆదిలోనే హంసపాదు ఎదురైవుతోందని సమాచారం. గత రెండేళ్లుగా గూగుల్ గ్లాసెస్ వాడుతున్న గూగుల్ వ్యవస్థాపకులులో ఒకరూన సర్జీ బ్రిన్ కూడా కళ్లజోడు లేకుండా సిలిరాపఖ వాలీలో జరిగిన రెడ్ కార్పెట్ వేడుకకు హాజరవ్వడం కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే తాను తన కళ్లజోడును కారులోనే పెట్టివచ్చానని ఆయన సమర్థించుకున్నారు.

ఈ గ్లాసెస్ తో ప్రత్యేకమైన ఉపయోగాలు వున్నప్పటికీ వాటిని సమీప భవిష్యత్తులో సాధరణ ప్రజలకు అందించడంలో మాత్రం అవకాశాలు సన్నగిల్లాయని తెలుస్తోంది. ఇప్పటికే అనేక మంది ఈ తరహా కళ్లజోళ్లను తయారి నుంచి తప్పుకున్నారు. 16 మంది తయారీదారులను కలసిన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు , తోమ్మిది సంస్థలు ఈ తరహా ప్రాజెక్టుపై పనిచేయడాన్ని నిలిపివేశారని తెలిపాయి. ఈ తరహా ప్రాజెక్టులకు ప్రజల నుండి అంతగా స్పందన లేదని కొందరు, కళ్లజోళ్ల తయారీలో ఆంక్షలు వుండటం మరో ప్రతిబంధక అంశంగా మారుతుందని సంస్థలు వివరణ ఇచ్చాయి. అయితే గూగుల్ మాత్రం తమ నూతన అవిష్కరణను ప్రపంచ విఫణీలోకి తీసుకురావడం లేదన్న వార్తలను బాహాటంగానే ఖండిస్తోంది. తాము త్వరలోనే ఈ గ్లాసెస్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నాయి.

ఇటీవలి అధ్యయనం ప్రకారం, గూగుల్ గ్లాస్ ధరించి డ్రైవ్ చేయటం లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించడం రెండూ కూడా ఒకేరకమైన పరధ్యానాన్ని కలిగిస్తుందని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా సైకలాజికల్ రీసెర్చర్ బెన్ సాయెర్ చెప్పిన దాని ప్రకారం, ఊహించని ట్రాఫిక్ సందర్భంలో ప్రజలు ఎంత వేగంగా ప్రతిస్పందిస్తారో, వారి బ్రేక్‌లను ఎంత వేగంగా అప్లయ్ చేస్తారో అనే అంశాన్ని చూసినట్లయితే, గూగుల్ గ్లాస్ మరియు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య పెద్ద వ్యత్యాసాన్ని తామేమీ గుర్తించలేదని అన్నారు. అదీ కాకుండా, ఫేస్ బుక్, ట్విట్టర్ సహా వందలాది అప్లికేషన్లకు నెలవుగా వున్న ఈ గ్లాసెస్ ఎంతగానో ఉపకరిస్తాయని సంస్థలు చెబుతుండగా, వాటిలోంచి ట్విట్టర్ ఇటీవలే తప్పుకుంది.

అయితే గూగుల్ మాత్రం సంపూర్ణ శక్తితో నిత్యం ధరించేలా కళ్లజోళ్లను సిద్దం చేస్తామని అంటోంది. ఇందుకోసం వందలాది ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ లు శ్రమిస్తున్తున్నారని గూగుల్ గ్లాసెస్ బిజినెస్ అపరేషన్స్ హెడ్ క్రిస్ ఓ నీల్ తెలిపారు. గూగుల్ ఎక్స్ డివిజన్ నుంచి వచ్చిన తొలి అవిష్కరణ గూగుల్ గ్లాసెస్ అని ఆయన చెప్పుకోచ్చారు. అయితే ఏది నిజమో, ఏది కాదో చూడాలంటే మరి కోన్ని ఏళ్లు వేచి చూడాల్సిందే.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles