Who will head microsoft after ballmer

India Satya Nadella CEO of microsoft, satya nadella possibility, Microsoft CEO Ballmer,

Microsoft has announced that Steve Ballmer will retire within 12 months and the company is already looking for his replacement. There are a number of possible candidates who can replace.

బాల్మర్ స్థానం సత్యకు దక్కేనా ?

Posted: 08/26/2013 04:40 PM IST
Who will head microsoft after ballmer

ప్రపంచంలో నంబర్ వన్ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి అధినేతగా (సీఈఓ) చేసే ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. అందునా ఒక తెలుగు వాడికి... అదీ హైదరాబాద్ వాడికి. అవును మైక్సోసాఫ్ట్ కంపెనీ సీఈఓ పదవికి హైదరాబాద్ కి చెందిన సత్య నాదెళ్లను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1992లో ఆ కంపెనీలో చేరిన సత్య అంతకు ముందు సన్ సిస్టమ్స్ లో పనిచేశారు. వచ్చే ఏడాది ఆ సంస్థ సీఈఓ స్టీవ్ బాల్మర్ తన పదవి నుండి తప్పుకోననున్నట్లు ప్రకటించడంతో ప్రస్తుతం క్లౌడ్, ఎంటర్ ప్రైజెస్ విభాగాలను పర్యవేక్షిస్తున్న సత్యను నియమించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈయనను నియమించడం వలన గూగుల్ నుండి క్లౌడ్ విభాగంలో ఎదుర్కొంటున్న గట్టి పోటీని తట్టుకోవచ్చని, మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టాను పొందిన సత్య నాదెళ్ల యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. అలాగే చికాగో విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. క్లౌడ్ సర్వీసుల్లో అపార అనుభవం ఉన్న సత్య నాదెళ్ల ఒక్కరే బాల్మర్ స్థానాన్ని భర్తీ చేయగలుగుతారని ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌లో వార్తలు వినిపిస్తుండటం విశేషం. మరోవైపు సత్య నాదెళ్లతో పాటు మార్కెటింగ్ సిఇఒ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టామి రెల్లర్, సిఒఒ కెవిన్ టర్నర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టోనీ బేట్స్ పేరు సిఇఒ రేసులో వినిపిస్తున్నాయి. చూద్దాం మన తెలుగు వాడికి ఆ హోదా దక్కుతుందో లేదో ???

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles