British airways announces hyderabad london daily

ritish Airways, new service,transport,air transport,British Airways, international tourism, Hyderabad to London flights, Boeing 777—200

British Airways announces Hyderabad-London daily

హైదరాబాద్ - లండన్ డైలీ విమాన సర్వీసులు

Posted: 07/31/2013 07:12 PM IST
British airways announces hyderabad london daily

ప్రముఖ విమానయాన సంస్థ బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి హైదరాబాద్-లండన్ మధ్య ప్రతి రోజూ  విమాన సర్వీసులు నడపనుంది. ప్రస్తుతం ఈ కంపెనీ లండన్ నుండి ఢిల్లీ , ముంబయి నగరాలకు రోజు 2 విమాన సర్వీసులు , బెంగుళూరుకు రోజు ఒక సర్వీసు, చెన్నై - హైదరాబాద్ నగరాల మధ్య వారంలో ఆరు విమానాలను నడుపుతోంది. మొత్తంగా వీటి సంఖ్య వారంలో మొత్తం 46 గా ఉంది. ఇక అక్టోబర్ 27 నుండి హైదరాబాద్ - లండన్ మధ్య రోజు ఒక సర్వీసు నడుపుతామని, దక్షిణాసియాలో ప్రధాన మార్కెట్‌గా నిలిచినందునే హైదరాబాద్-లండన్ మధ్య సర్వీసుల సంఖ్యను పెంచామని బ్రిటిష్ ఎయిర్‌వేస్ దక్షిణాసియా ప్రాంత కమర్షియల్ మేనేజర్ క్రిస్టఫర్ ఫోర్డిస్  మీడియాకు తెలిపారు. వ్యాపారపరంగా సంస్థకు యూకే వెలుపల అమెరికా తర్వాతి స్థానం భారత్‌దేనని చెప్పారు.  ఏటా 1.5 కోట్ల మంది భారతీయులు వివిధ దేశాలకు వెళ్తున్నారు. ఒక నివేదిక ప్రకారం 2020 నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు చేరుకుం టుందని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles