Gold rate week

Gold rate week, Gold Prices Could Still Correct,

Gold rate week, Gold Prices Could Still Correct,

ఒడిదొడుకులకు బంగారం రేటు

Posted: 07/27/2013 07:59 PM IST
Gold rate week

కొన్ని నెలలుగా తీవ్ర ఒడిదొడుకులకు బంగారం రేటు లోనవుతోంది. ఒకానొక దశలో 25 వేలను తాకిన పసిడి ధర... ఇప్పుడు మళ్లీ కాస్త పుంజుకుంది. అయితే, ఈ ధర పెరుగుదల ఎక్కువ రోజులు ఉండకపోవచ్చం టున్నాయి బులియన్ మార్కెట్ వర్గాలు. ఈ ఏడాది ధనత్రయోదశి నాటికి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 23 వేల రూపాయలకు దిగొస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు.. అనేక సహేతు కారణాలు చూపుతు న్నారు కూడా. అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం, బంగారం అధికంగా వినియోగించే ఇండియా, చైనాలో గిరాకీ తగ్గడం అందుకు సూచన లుగా భావిస్తున్నారు. మరోవైపు, ఆర్‌బీఐ తీసుకున్న పలు నిర్ణయాలు కూడా బంగారం ధర కరెక్షన్‌కు కారణమవుతోంది. డాలర్ విలువ పెరగడం.. దిగుమతిపై 8 శాతం కస్టమ్స్ సుంకం, 1 శాతం వ్యాట్‌లతో పసిడి మరింత ప్రియమవుతోంది. అయితే, ఇది తాత్కాలిక మేనని.. దీర్ఘకాలంలో బంగారం ధర తగ్గుతుందం టున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంతో బంగారంపై పెట్టుబడులు తగ్గుముఖం పట్టనున్నాయ్. ఇప్పటికే చైనాలో బంగారం వినియోగం భారీగా తగ్గడంతో అంతర్జాతీయంగా పుత్తడి ధర క్షీణించే అవకాశముంది. ఈసంవత్సరం ప్రారంభంలో 30 వేల రూపాయలకు పైగా వున్న పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 26 వేల రూపాయల స్థాయిలో కొనసాగుతోంది. రెండు నెలల క్రితం బంగారం ధర 25 వేల రూపాయల దిగువకు కూడా వెళ్ళింది. అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో భారత్‌లో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర 23 వేల రూపాయలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కీలకమైన 23 వేల రూపాయల స్థాయికి బంగారం దిగొస్తే, దేశీయ బులియన్ మార్కెట్లో లావాదేవీల సంఖ్య పెరుగుతుం దనడంలో సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles