Tech mahindra completes satyam merger

Tech Mahindra,Satyam Computer Services,Pune,Merger,Mahindra Group

The merged entity creates a services powerhouse, with revenues of $2.7 billion, a team of 84,000 professionals across 46 countries.

సత్యం పేరు ఇక పై కనుమరుగు...

Posted: 06/26/2013 04:17 PM IST
Tech mahindra completes satyam merger

ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాలో మహీంద్రా సత్యం విలీనం మంగళవారం అధికారికంగా పూర్తయ్యింది. ఇకపై ఈ సంస్థ టెక్ మహీంద్రా పేరుతో కొనసాగుతుంది. దీంతో.. ఐటీ రంగంలో రాష్ట్రానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చిన సత్యం కంప్యూటర్స్(మహీంద్రా సత్యం) పేరు పూర్తిగా కనుమరుగైంది. తాజా పరిణామంతో టెక్ మహీంద్రా 2.7 బిలియన్ డాలర్ల ఆదాయంతో .. దేశీయంగా అయిదో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ సంస్థగా ఆవిర్భవించింది. ఆనంద్ మహీంద్రా దీనికి చైర్మన్‌గాను, వినీత్ నయ్యర్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా, సీఎఫ్‌వోగా మిలింద్ కులకర్ణి ఉంటారు. టెక్ మహీంద్రాలో మహీంద్రా సత్యం విలీనాన్ని రెండు సంస్థల బోర్డులు గతేడాది మార్చి 21న ఆమోదించగా, ఈ నెల 11న రాష్ట్ర హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. విలీనానికి మార్గం సుగమమైంది. సంయుక్తంగా అతి పెద్ద ఐటీ కంపెనీగా ఎదుగుతామంటూ, 2009లో సత్యం కొనుగోలు సమయంలో మేం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం అని మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా చెప్పారు. భవిష్యత్‌లో మరింత వేగంగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.

గత నాలుగేళ్లుగా తాము చట్టపరంగా అనేక సవాళ్లు అధిగమించామని, ఉత్తమ విధానాలను పాటించడం ద్వారా షేర్‌హోల్డర్లకు మరింత ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేశామని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. కంపెనీపై విచారణలేమీ పెండింగ్‌లో లేవని నయ్యర్ చెప్పారు. రామలింగరాజు హయాంలో కుంభకోణానికి సంబంధించిన విచారణ విషయంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. కంపెనీకి కొత్త లోగోను ఆవిష్కరించారు. ప్రస్తుతం టాప్ ఫోర్ దేశీ ఐటీ కంపెనీలుగా.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles