Rbi disappointment

RBI, RBI again disappoint, repo rates,

RBI again disappointment

RBI disappointment.png

Posted: 12/18/2012 06:07 PM IST
Rbi disappointment

RBIరిజర్వ్‌ బ్యాంకు మళ్లీ నిరాశపర్చింది. వడ్డీరేట్లను ఈసారి కూడా తగ్గించలేదు. మిడ్‌క్వార్టర్‌ పరపతి విధానం సమీక్షలో రెపోరేటును, నగదు నిల్వల నిష్పత్తిని యథావిధిగా ఉంచింది. వడ్డీరేట్లు తగ్గించాలని పరిశ్రమ వర్గాలు ఎంతగా మొత్తుకున్నా ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఆలకించలేదు. చాలా మంది అనలిస్టులు అంచనా వేసినట్లు కనీసం సీఆర్‌ఆర్‌ను కూడా తగ్గించలేదు. రెపోరేటును 8 శాతం వద్ద, సీఆర్‌ఆర్‌ను 4.25 శాతం వద్దే ఉంచింది.

గత ఏప్రిల్‌లో రెపోరేటును అర శాతం తగ్గించిన ఆర్‌బీఐ అప్పటి నుంచి దాని జోలికి వెళ్లడం లేదు. ధరల పెరుగుదల ఇప్పటికీ సమస్యాత్మకంగానే ఉందని, వచ్చే 2 నెలల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర బ్యాంకు విశ్లేషించింది. ఏప్రిల్‌ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలోగానీ ధరలు తగ్గుతాయని అంచనా వేసింది.ధరల పెరుగుదల తగ్గితేనే వడ్డీరేట్లు తగ్గిస్తామని తెలిపింది. ఆర్‌బీఐ నిర్ణయంతో స్టాక్‌ మార్కెట్లు లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్‌ ప్రారంభంలో 70 పాయింట్లు పెరిగింది. పరపతి విధానం ప్రకటన తర్వాత ఈ లాభాలు పూర్తిగా హరించుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tata sons appoints cyrus p mistry as chairman from dec 28
Male airport contract issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles