సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం విప్రో... ఐటీయేతర బిజినెస్‌లను విడదీసి ఒక ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. తద్వారా సాఫ్ట్‌వేర్ సేవల బిజినెస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించనుంది. ఇందుకు విప్రో ఎంటర్‌ప్రైజెస్ పేరుతో కొత్తగా అన్‌లిస్టెడ్ సంస్థను ఏర్పాటు చేయనుంది. దీనిలో భాగంగా కన్సూమర్ కేర్ లైటింగ్(ఫర్నిచర్ విభాగం కూడా), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ (హైడ్రాలిక్స్, వాటర్ బిజినెస్‌లు), మెడికల్ డయాగ్నస్టిక్ ఉత్పత్తులు, సర్వీసుల బిజినెస్‌లను విప్రో ఎంటర్‌ప్రైజెస్ కింద ఏర్పాటు చేయనుంది. ఈ వార్తల నేపథ్యంలో విప్రో షేరు ఒక దశలో 7% ఎగసింది. అయితే చివరికి 3% లాభంతో (బీఎస్‌ఈ) రూ. 361 వద్ద ముగిసింది. కాగా, శుక్రవారం (2న) సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను విప్రో వెల్లడించనుంది.
కంపెనీని రెండుగా విడదీయడం వల్ల లాభాల మార్జిన్లు మెరుగుపడతాయని విప్రో సీఎఫ్‌వో సురేష్ సేనాపతి అభిప్రాయపడ్డారు. మొత్తంగా విప్రో మార్జిన్లతో పోలిస్తే ఐటీ బిజినెస్ లాభదాయకత గరిష్ట స్థాయిలో ఉంటుందని తెలిపారు. ఐటీ సేవల కంపెనీగా విప్రో లిస్టింగ్ కొనసాగుతుందని, లిస్టింగ్ చేసేటంత పెద్ద వ్యాపారాలు కాకపోవడంతో విప్రో ఎంటర్‌ప్రైజెస్ మాత్రం అన్‌లిస్టెడ్ కంపెనీగా వ్యవహరిస్తుందని చెప్పారు.
వ్యాపార విభజన నేపథ్యంలో యాజమాన్య నిర్వహణలో మార్పులుండ వని సేనాపతి చెప్పారు. విప్రో బోర్డు యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. విప్రో, విప్రో ఎంటర్‌ప్రైజెస్ నిర్వహణలో ఎలాంటి మార్పులుండవని తెలిపారు. అజీం ప్రేమ్‌జీ విప్రోకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గానే బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. అయితే విప్రో ఎంటర్‌ప్రైజెస్‌కు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు. మొత్తం ఆదాయంలో 90% వాటాను ఆక్రమిస్తున్న ఐటీ సేవలపై మరింత దృష్టిపెట్టేందుకే వ్యాపార విభజనను చేపడుతున్నట్లు చెప్పారు.దీంతో కస్టమర్లు, టార్గెట్ కంపెనీలు, ఇన్వెస్టర్లకు తమ బిజినెస్‌పట్ల అవగాహన పెరుగుతుందని కంపెనీ సీఈవో(ఐటీ బిజినెస్) టీకే కురియన్ వ్యాఖ్యానించారు. వెరసి కంపెనీ పోటీతత్వం మెరుగుపడుతుందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more