మాజీ టెలికామ్ మంత్రి రాజా హయాంలో జారీ చేసిన 2జి లైసెన్స్‌లను (122) రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల టెలికామ్ రంగంలో నెలకొన్న అనిశ్చితి తొలిగిపోతుందని పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు, టెలికామ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ప్రభుత్వ పాలసీలపై స్పష్టత ఏర్పడే అవకాశం ఉన్నందున విదేశీ ఇన్వెస్టర్లకు అవకాశాలు లభిస్తాయని ఈ పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు పేర్కొన్నాయి.
టెలికామ్ రంగం వృద్ధికి సుప్రీంకోర్టు తీర్పు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ తాజా పరిణామాలతో టెలికామ్ వినియోగదారులు ఇబ్బందిపడకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ప్రభుత్వానికి ట్రాయ్‌కి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిఐఐ, అసోచామ్ ఫిక్కి తెలిపాయి. కొత్త వాతావరణంలో ప్రభుత్వం భారీ ఎత్తున టెలికామ్ రంగంలోకి విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానించాలని సిఐఐ సూచించింది. దేశంలో 90 కోట్ల మందికిపైగా ఉన్న టెలికామ్ వినియోగదారుల్లో కేవలం 5 శాతం మంది మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని సిఐఐ తెలిపింది. టెలికామ్ రంగంలో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు కోర్టుతీర్పు ప్రయోజనకారిఅని అసోచామ్ వ్యాఖ్యానించింది. స్పెక్ట్రమ్ వంటి అరుదైన జాతీయ వనరులను కేటాయించడంలో పోటీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను కోర్టు తీర్పు స్పష్టం చేసిందని ఫిక్కి తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more