పారిశ్రామికవేత్తలు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య విభేదాలు లేవని, ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ కలిసే ఉన్నారని వారి తల్లి కోకిలాబెన్ అన్నారు. వారి తండ్రి ధీరూభాయ్ అంబానీ స్మారకం ప్రారంభ కార్యక్రమంలో వారిని కలిపేందుకు కుటుంబం అన్ని ఏర్పాట్లు చేశారు. ముకేష్, అనిల్ మధ్య ఏ విధమైన విభేదాలు లేవని, పరస్పరం చెడు భావన కూడా లేదని, రేపు వారిద్దరు కుటుంబ సభ్యులతో చోర్వాడ్లో కలిసి ఉంటారని ఆమె మంగళవారం అన్నారు. ధీరూభాయ్ అంబానీ స్వంత పట్టణం చోర్వాడ్లో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. డిసెంబర్ 28వ తేదీన ధీరాభాయ్ అంబానీ 80వ జయంతి సందర్భంగా ఆయన మెమోరియల్‌ను ఇక్కడ ప్రారంభించనున్నారు. అంబానీ సోదరులిద్దరు దీనికి హాజరవుతారని భావిస్తున్నారు. ఇది తమ కుటుంబ కార్యక్రమమని, ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులంతా వస్తారని కోకిలా బెన్ అన్నారు. 2002 జులైలో ధీరూభాయ్ అంబానీ మృతి తర్వాత అంబానీ సోదరులిద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ముకేష్, అనిల్ 2006లో విడిపోయారు. వ్యాపారాలను కూడా పంచుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Jul 19 | దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరోసారి పాతాళానికి పడిపోయింది. డాలరుతో పోలిస్తే తొలిసారి 80కి చేరుకుంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 79.9863 వద్ద ప్రారంభమై తర్వాత యుఎస్ డాలర్‌తో రూపాయి ఆల్ టైమ్... Read more
Jul 02 | టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తన తాజా మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను ఆవిష్కరించడంతో అత్యంత పోటీతత్వంతో కూడిన మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశించింది. రాబోయే పండుగ సీజన్లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న ఈ... Read more
May 28 | భారత్‌లో వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 10 శాతానికి పైగా పెంచుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ `బీఎండబ్ల్యూ` లక్ష్యంగా పెట్టుకున్నది. ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4ను భారత్‌లో ఆవిష్కరించింది. వాహనాల... Read more
Apr 27 | నోకియా ఫోన్ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా నోకియా జీ 21 ('Nokia G21') పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్... Read more
Apr 22 | పెట్రోలు ధరలు సామాన్యులనే కాదు సంపన్నులను ఇబ్బంది పెడుతున్నాయి. రెండేళ్లలో లీటరు పెట్రోలు ధర రమారమి రూ.50 వంతున పెరిగింది. దీంతో పెట్రోలు వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు జనాలు మళ్లుతున్నారు. ఈ... Read more